దర్శకుడు కోదండరామిరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. సంధ్య సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన ఆయన 93 సినిమాలకి దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవితో సినిమాలు చేశారు కోదండరామిరెడ్డి.. తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
"1985 నుంచి 90 వరకు నాకు వరుస హిట్‌లు. వచ్చాయి. మధ్యలో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఒకే రోజు రెండు సినిమాలు విడుదలై, హిట్ కొట్టిన సందర్భం కూడా ఉంది. అలా వరుసగా సినిమాలు హిట్టు కావడంతో ఓ సినిమా చేసి పెట్టండి సార్ అంటూ చాలా మంది అడిగేవారు. ఇప్పుడు కుదరదు అని చెప్పిన కూడా మీకు విలునప్పుడు చేయండి అంటూ అడిగేవారు. నేను బయటకు వస్తే నా కోసం 20 కార్లు ఉండేవి. ఏ కారు ఎక్కాలో అర్థమయ్యేది కాదు. నా జీవితం యాంత్రికమైపోయింది అన్నప్పుడు నేను ఆలోచనలో పడ్డాను .భగవంతుడా.. ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని కోరుకున్నానని " కోదండరామిరెడ్డి చెప్పుకొచ్చారు.
కోదండరామిరెడ్డి 93 సినిమాలలో చిరంజీవితో 25 సినిమాలు, బాలకృష్ణతో పదమూడు సినిమాలు. నాగార్జునతో ఏడు, వెంకటేశ్‌తో రెండు సినిమాలు చేశారు.చివరగా అయన తన కుమారుడు వైభవ్ తో కలిసి రెండు సినిమాలు చేశారు. కానీ అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి.