Sugarcane: ఈ వ్యాధి ఉన్నవారికి చేరుకు రసం విషం.. పొరపాటున తాగకండి
Sugarcane Side Effects: ఎండాకాలం వచ్చిందంటే చెరుకు రసం కచ్చితంగా తాగుతారు. అయితే కొన్ని సమస్యలు ఉన్నవాళ్లు చెరుకు రసం తాగకుండా ఉంటే మంచిది.
Sugarcane: ఈ వ్యాధి ఉన్నవారికి చేరుకు రసం విషం.. పొరపాటున తాగకండి
Sugarcane Side Effects: ఎండ వేడిమి ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో చల్లని పానీయాలు తీసుకుంటాం. అయితే ప్రధానంగా ఆరోగ్యకరమైన డ్రింక్స్ మాత్రమే తీసుకోవాలి. ఇందులో కొబ్బరి నీరు, చెరువు రసం ఆ పండ్ల రసాలు వస్తాయి. అయితే చెరుకు రసం ఎక్కువమంది తాగుతారు. ఇది కడుపు సమస్యలను కూడా తగ్గిస్తుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చెరుకు రసం తీసుకోకూడదు.
చెరుకు రసం తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తున్నారు. అందుకే ఎండాకాలం చెరుకు రసాన్ని తీసుకుంటారు. అయితే ఇందులో కార్బోహైడ్రేట్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వీటిని తీసుకోకపోవడమే మంచిది.
డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు చెరుకు రసం తీసుకోకూడదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెంచేస్తాయి. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ సూచీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి ఉన్న వాళ్లు చెరుకు రసానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. లేకపోతే ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది.
అంతే కాదు తలనొప్పి సమస్యతో బాధపడుతున్న వారు కూడా చెరుకు రసం తీసుకోకూడదు. ఒక్కోసారి చెరుకు రసం కూడా తలనొప్పికి కారణం కావచ్చు. తద్వారా తలనొప్పి, తల తిరగడం వంటి సమస్య కూడా పెరిగే అవకాశం ఉంది.
అతిగా లావు ఉన్న వాళ్లు కూడా చెరుకు రసం తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలని వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు చెరుకు రసం తీసుకోకపోవడం మంచిది. లేకపోతే బరువు పెరుగుతారు.
అంతేకాదు చెరుకు రసం వ్యవస్థ బలహీనంగా ఉన్న వాళ్ళు కూడా తాగు కూడదు. ఇందులో పాలు ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా కడుపునొప్పి, విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంది. కడుపు సమస్యలు ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండడం మంచిది.
వీళ్లు మాత్రమే కాదు చెరుకు రసం తగ్గు రొంప సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కూడా తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఇది శరీరాన్ని ఒక్కసారిగా చల్లబరుస్తుంది. కాబట్టి ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది.