వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం తన ఫోకస్ అంతా తన తదుపరి సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్ పైన పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో కేవలం నిజాలను మాత్రం మాత్రమే తెలియజేస్తాము అంటూ ఆర్జివి సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర లో ముంబై కి చెందిన ఒక థియేటర్ యాక్టర్ విజయ్ కుమార్ నటించారు. తన అసిస్టెంట్లు తీసుకొచ్చిన కొన్ని ఫోటోలను చూస్తున్న ఆర్జీవీకి ఇతని ఫోటో కనిపించిందట.
ఇక విజయ్‌కుమార్ ను ఎన్టీఆర్ పాత్ర కోసం అనుకున్న తర్వాత అతన్ని ఎన్టీఆర్ లాగా మార్చడానికి వర్మ ఏం చేశారో కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు వర్మ. నందమూరి తారక రామారావు గారి లాగా నటించడం కోసం విజయ్ కు రెండు నెలలకు పైగా ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాక చూడటానికి ఎన్టీఆర్ లాగా ఉన్నామా లేదా అనే విషయంపై కాకుండా ఎమోషనల్ గా కూడా ఎన్టీఆర్ లాగానే ఆలోచించమని, నటించమని వర్మ చెప్పాడట. విజయ్ కుమార్ నటన సినిమా లో హైలైట్ అవుతుందని వర్మ చెబుతున్నాడు. ఈ సినిమా మార్చి 29 వ తారీఖున విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది.