నేడు..అంతర్జాతీయ కుంటుబ వ్యవస్థ దినోత్సవము!
ఈ రోజు అంతర్జాతీయ కుంటుబ వ్యవస్థ దినోత్సవము. కుటుంభం అనగానే ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న, ఒక చెల్లె లేదా ఒక తమ్ముడు గుర్తుకువస్తారు కదా. ఇది చిన్న కుటుంబం అని అర్ధం. వీరికి తోడు తాతయ్య, బామ్మలు ఉండనే ఉంటారు. చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడమంటే అందరూ సంతోషంగా ఫీలవుతుంటారు. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి కుటుం బాలువారివే. అంటే ఒక చెట్టుకు ఎన్నో కొమ్మలు వచ్చినట్టు...ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించినప్పటికీ వంశవృక్షపు వేళ్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటాయి.
కుటుంబంలో ఉండే మూడు ముఖ్యలక్షణాలు రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం. కుటుంభ వ్యవస్థకి సంబంధించి, అంతర్జాతీయ కుంటుబ వ్యవస్థ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1992 లో మే 15 న ఈ దినోత్సవాన్ని జరుపుటకు నిశ్చయించింది. ఆ రోజు నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
ఈ రోజుల్లో సంవత్సరంలో ఒక రోజైనా అందరూ కలుసుకోవాలని సరదాగా గడపాలని కోరుకోవడం సహాజం. ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో.కేవలం ఫోన్‌లోనో, మొబైల్‌లోనో యోగక్షేమాలు కనుక్కునే కుటుంబాలు కూడా లేక పోలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మనదేశం పుట్టి ల్లు. ఇప్పుడు ఆ సంస్కృతి భూతద్దం పెట్టి వెతికినా దొరకదంటే అతిశయోక్తి కాదు. అనేక కుటుంబాలు వ్యక్తిగత కారణాలతో విచ్ఛిన్నం కావడం మనం రోజూ చూస్తూ ఉన్నదే. అయినప్పటికీ మన దేశంలో అనేక కుటుంబాల మధ్య కనిపించే అన్యోన్యతా భావం మరే దేశంలోనూ కనిపించదు.