Sunita Williams: సునీతా విలియమ్స్‌కు అదనపు వేతనం చెల్లిస్తారా?: రూల్స్ ఏం చెబుతున్నాయి?
Sunita Williams: సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో గడిపి ఇటీవలనే భూమి మీదకు వచ్చారు.

Sunita Williams: సునీతా విలియమ్స్‌కు అదనపు వేతనం చెల్లిస్తారా?: రూల్స్ ఏం చెబుతున్నాయి?
Sunita Williams: సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో గడిపి ఇటీవలనే భూమి మీదకు వచ్చారు. సునీతా విలియమ్స్, విల్ మోర్ కు చెల్లించాల్సిన అదనపు వేతనాన్ని తానే స్వంతంగా చెల్లిస్తానని ట్రంప్ ప్రకటించారు. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు అదనపు వేతనాలు ఎందుకు చెల్లిస్తారు? వీటిని ఎలా డిసైడ్ చేస్తారో ఓసారి తెలుసుకుందాం.
వ్యోమగాములకు అదనపు వేతనాలు ఇస్తారా?
వ్యోమగాములను అంతరిక్ష యాత్రలలో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. పని కోసం ప్రయాణించే ఏ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వారి ప్రయాణం, భోజనం ఖర్చును మాత్రమే నాసా భరిస్తుంది. ఒకవేళ నిర్ణీత కాలవ్యవధి కంటే ఎక్కువ సమయం అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వస్తే మాత్రం అదనపు వేతనాలు చెల్లించే సౌలభ్యం మాత్రం లేదు. సెలవులు, వీకేండ్ వంటి వాటికి సంబంధించి కూడ ఎక్స్ ట్రా వేతనాలు చెల్లించరు.టెక్నికల్ సమస్యలు సంభవిస్తే అంతరిక్షంలోనే నిర్ణీత షెడ్యూల్ కంటే ఎక్కువ రోజులు గడపాల్సి వస్తోంది. అలాంటి సమయంలో వ్యోమగాములకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి రోజుకు 5 డాలర్ల చొప్పున చెల్లిస్తారు.
సునీతా విలియమ్స్ కు అదనపు వేతనం లభిస్తోందా?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే 9 రోజుల పాటు చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ కు కూడా అదనపు వేతనం లభించదు. ఎనిమిది రోజులపాటు అంతరిక్షంలో వీరిద్దరూ ఉండాలి. కానీ 286 రోజులు అంతరిక్షంలోనే గడిపారు. అయితే వీరికి అదనంగా రూ.1430 డాలర్లు అందుతాయి.
152 రోజులు అంతరిక్షంలో గడిపిన అండర్సన్ కు ఎంత దక్కింది?
నాసాకు చెందిన వ్యోమగామి కేటన్ అండర్సన్ రోజుకు 1.20 డాలర్ల వేతనం పొందారు. 2007లో ఆయన అంతరిక్షంలో 152 రోజులపాటు గడిపినందుకు ఆయనకు 172 డాలర్లు అందాయి. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపితే వ్యోమగాములకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతరిక్షం నుంచి వచ్చిన వ్యోమగాములకు కనీసం 45 రోజుల చికిత్స అందిస్తారు.
సునీతా విలియమ్స్, విల్ మోర్‌కు జీఎస్ 15 గ్రేడ్ కింద వేతనం తీసుకుంటారు. వ్యోమగాములు పొందిన శిక్షణతో పాటు ఇతర అంశాల ఆధారంగా వేతనాలను నిర్ణయిస్తారు. జీఎస్ 13, జీఎస్ 14, జీఎస్ 15 గ్రేడ్ లుగా విభజించి వ్యోమగాములకు జీతాలు చెల్లిస్తారు.