Voyage of the Iguanas: ఎలా వచ్చాయో తెలియని ఇగ్వానాలు.. ఫిజీకి సాగర ప్రయాణం వెనుక నిజం
Voyage of the Iguanas: అమెరికా నుంచి ఫిజీకి 8,000 కిలోమీటర్లు ఇగ్వానాలు ప్రయాణించాయి. తాటి చెట్లు, వేర్లతో కూడిన తేగలపై వేల కిలోమీటర్లు ప్రయాణించి సముద్రాన్ని దాటి వచ్చారని తెలుస్తోంది.

Voyage of the Iguanas: ఎలా వచ్చాయో తెలియని ఇగ్వానాలు.. ఫిజీకి సాగర ప్రయాణం వెనుక నిజం
Voyage of the Iguanas: ఇగ్వానాలు అనే సరికి మనకు గుర్తుకు వచ్చే ప్రాంతాలు అమెరికా, దక్షిణ అమెరికా, లేదా కరేబియన్ దీవులు. కానీ ఫిజీ, టోంగా అనే దక్షిణ పసిఫిక్ దీవుల్లో కూడా ప్రత్యేకమైన ఇగ్వానాలు కనిపిస్తున్నాయి. వీటి ఆవిర్భావం శాస్త్రవేత్తలకు పెద్ద ప్రశ్నగా మారింది. అక్కడి వరకు ఇగ్వానాలు ఎలా వచ్చాయో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఇప్పుడు ఓ కొత్త పరిశోధన చెబుతోంది. ఈ ఇగ్వానాల పూర్వీకులు వేల కిలోమీటర్లు తేగలపై ప్రయాణించి ఫిజీకి వచ్చారని. అంటే తాటి చెట్లు, మొక్కలు వేర్లతో కలిసి నీటిలో తేలుతూ పోయే తేగలపై ప్రయాణించారు. ఇది 8,000 కిలోమీటర్ల దూరం..! ఇది మనిషికాదుగానీ ఇతర కశేరుక జీవులలో ఇప్పటివరకు నమోదు అయిన అతి పెద్ద సముద్ర ప్రయాణం.
అంత దూరం ఇగ్వానాలు ఎలా ప్రయాణించగలిగాయనేదానికి శాస్త్రవేత్తలు రెండు ముఖ్య కారణాలు చెప్పారు. ఒకటి, వాటి శరీరానికి తక్కువ ఎనర్జీ అవసరం కావడం వల్ల ఎక్కువ కాలం ఆకలితో తట్టుకోవచ్చు. రెండోది, తేగలపై మొక్కలు ఉండే అవకాశం ఉంది కాబట్టి తినడానికి ఆహారం కూడా దొరికివుంటుంది.
అదే సమయంలో.. ఫిజీ దీవులు 30 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడ్డాయని, అప్పుడు ఇతర దారుల ద్వారా ప్రయాణం అసాధ్యమని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే సముద్రంపై తేగలపై ప్రయాణం మాత్రమే ఈ జీవులు అక్కడికి వెళ్లేందుకు కారణమని వారు తేల్చారు. ఇది ప్రకృతి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చెప్పే అరుదైన ఉదాహరణ. తిన్నగా జీవించేందుకు కొన్ని జంతువులు ఎంత దూరమైనా ప్రయాణించగలవనే దానికి ఫిజీ ఇగ్వానాలు నిజమైన సాక్ష్యం.