Israel: హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను హతమార్చిన ఇజ్రాయెల్

Update: 2025-03-22 02:48 GMT
Israel: హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను హతమార్చిన ఇజ్రాయెల్
  • whatsapp icon

Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఈ క్రమంలోనే టెల్ అవీవ్ ఓ కీలక ప్రకటన చేసింది. హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను తమ బలగాలు హతమార్చినట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. దక్షిణ గాజాలో ఒసామా తబాష్ ను మా ఐడీఎఫ్ దళాలు హతమార్చాయని తెలిపింది. అతను ఉగ్రవాద సంస్థ నిఘా లక్ష్యాత్మక యూనిట్ విభాగానికి కూడా అధిపతిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపింది.

ఈ ప్రకటనపై హమాస్ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన తెలపలేదు . ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ ల మద్య జరిగిన తొలికాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం కొనసాగింపును ఉగ్రవాద సంస్థ తిరస్కరించింది. దీని కారణంగానే తాజా దాడులు జరిగాయని అమెరికా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పేర్కొంది. ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లయితే ఇలా జరిగేది కాదని పేర్కొంది.

కాగా మంగళవారం గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 500 మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. మరణించినవారిలో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం మార్పులను హమాస్ తిరస్కరించడంతోనే దాడులకు ఆదేశించానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన హమాస్ దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వార్నింగ్ ఇచ్చింది. గురువారం ఉదయం కూడా గాజాపై ఐడీఎఫ్ దళాలు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 85 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మందికి గాయాలయ్యాయి.

మరోవైపు హమాస్ బందీలను విడిచిపెట్టేవరకు గాజాలోని భూభాగాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తామని ఇజ్రాయోల్ రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. హమాస్ తలొగ్గితేనే తమ ఆక్రమణ ఆగుతుందని అప్పటి వరకు సైన్యం మరిన్ని భూభాగాలను ఇజ్రాయెల్ లో విలీనం చేస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బందీలు విడుదలయ్యే వరకు సైన్యం ఒత్తిడి పెంచాలని తెలిపారు. గాజా లేదా వెస్ట్ బ్యాంకులోని భూభాగాలను ఆక్రమించుకోవడాన్ని ఫ్రాన్స్ తప్పుబట్టింది. రెండు దేశాలు ఒక్కదానిపక్కన ఒకటి శాంతితో నివసించాలని ఆ దేశ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారెట్ తెలిపారు. 

Tags:    

Similar News