వైరల్ వార్త.. ఇదీ నిజం! కారులో కండోమ్ లేదని జరిమానా.. నిజామా కాదా?

గాసిప్..పుకారు పేరు ఏదైనా కానీయండి దాని వేగం మెరుపుకు కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల దిల్లీ లో ఓ క్యాబ్ డ్రైవర్ కు తన కారులోని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో కండోం లేనందుకు దిల్లీ పోలీసులు జరిమానా విధించారని వార్తలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. అవన్నీ నిజమేనా? ఒక్కసారి తెలుసుకుందాం..అసలు విషయం ఏమిటో!

Update: 2019-09-21 16:17 GMT

డిల్లీలో ట్రాఫిక్ పోలీసులు క్యాబ్ లను ఆపి పరీక్షిస్తుంటే, ఆ క్యాబ్ ల ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో కనపడిన వస్తువుల్ని చూసి ఆశ్చర్యపోయారు. దాదాపుగా అన్ని క్యాబ్ లలోనూ రెండు మూడు కండోమ్లు కనిపించాయి. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇవి ఎందుకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉన్నాయని ఆయా డ్రైవర్లను ప్రశ్నించిన పోలీసులకు వారిచ్చిన సమాధానం తొ మతి పోయింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లలో కండోం లు ఉండడం తప్పనిసరి అనీ, అవి లేకపోతె పోలీసులు ఫైన్ వేస్తారని తమకు వేరే క్యాబ్ డ్రైవర్లు చెప్పడంతో తాము ఈ విధంగా కండోం లను పెట్టుకున్తున్నామన్నారు. ఇంతకీ ఇది మీకెవరు చెప్పారు అంటే, దానికి స్పష్టమైన సమాధానం రాలేదు.

అసలు ఈ ఫైన్ నిజమేనా.. చట్టం ఏం చెబుతోంది?

డిల్లీ మోటారు చట్టం చెబుతున్న నిబంధనల ప్రకారం ప్రజా రవాణా కోసం ఉపయోగించే ప్రతి వాహనంలోనూ ప్రధమ చికిత్స కోసం బాక్స్ అందుబాటులో ఉంచాలి. అందులో కొన్ని రకాల మందులు ఉండాలని నిర్దేశించారు. అవికాకుండా గాయానికి కట్టు కట్టడానికి క్లాత్, దూది, టించర్ వంటివి ఉండాలి. అంతేకానీ, కండోం లు ఉంచాలన్న నిబంధన లేదు.

మరి పోలీసులు ఏమంటున్నారు?

ఈ విషయంపై స్థానిక పాత్రికేయులతో దిల్లీ పోలీసు ప్రత్యెక కమిషనర్ తాజ్ హాసన్ మాట్లాడారు. కండోంలు ఉండాలని నిబంధన లేదని ఆయన స్పష్టం చేశారు. తాము ఈ కారణంగా ఎవరికీ జరిమానాలు విధించలేదన్నారు.

మరి ఈ పుకారు ఎలా వచ్చింది..?

తన క్యాబ్ లోని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో కండోం లేనందుకు తనకు జరిమానా విధించారంటూ ధర్మేంద్ర అనే క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. దాంతో ఈ విషయం వైరల్ అయింది. కానీ, ఈ విషయంపై ఓ జాతీయ దినపత్రిక జరిపిన పరిశీలనలో ఇది అబద్ధమని తేలింది. నిజానికి ధర్మేంద్ర వాహనానికి వేసిన చలానా వాహనాన్ని అధిక వేగంతో నడిపినందుకు వేసినట్టు వెల్లడించింది.

ఇక్కడ కొసమెరుపేమిటంటే ఈ విషయంలో దిల్లీ సర్వోదయా డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు కూడా మూడు కండోం లు కచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉనాలని చెబుతుండడం. దానికి ఆయన చెప్పిన కారణాలలో కూడా చట్టంలూ ఈ నిబంధన ఉందనేది లేదు. అత్యవసర సమయంలో ఈ కండోం లు వేరే రకంగా అంటే.. ఏదైనా గ్యాస్ పైప్ లాంటిది కారులో పగిలినట్టయితే.. కండోం లను చుట్టడం ద్వారా కొంత సమయం వరకూ దానిని ఆపోచ్చనీ, దెబ్బలు తగిలినప్పుడు రక్తం కారకుండా కట్టు కట్టొచ్చనీ చెప్పుకొచ్చారు.

సో.. కారులో కండోం లేకపోతే జరిమానా వేస్తారన్నది ముమ్మాటికీ నిజం కాదన్నమాట! 

Tags:    

Similar News