చేతన్ భగత్ నవలల పై పరిశోధనలకు గాను విశాఖ లెక్చరర్ రవీంద్రనాథ్ కు డాక్టరేట్!
విశాఖపట్నం లోని డా. వి. యస్. కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఆంగ్ల అధ్యాపకునిగా పనిచేస్తున్న సి. వి. యస్. రవీంద్రనాథ్,
విశాఖపట్నం లోని డా. వి. యస్. కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఆంగ్ల అధ్యాపకునిగా పనిచేస్తున్న సి. వి. యస్. రవీంద్రనాథ్, ప్రొఫెసర్ వై. సోమలత గారి పర్యవేక్షణ లో ప్రఖ్యాత ఆంగ్ల రచయిత చేతన్ భగత్ వ్రాసిన నవలల పై "Contemporary India - Chetan Bhagat 's Perspective ("సమకాలీన భారత దేశం - చేతన్ భగత్ దృక్కోణం ") అనే శీర్షిక తో చేసిన పరిశోధనకు గాను ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆంగ్ల సాహిత్యం లో డాక్టరేట్ అవార్డు ప్రధానం చేశారు. ప్రముఖ దిన పత్రికలలో ఆంగ్ల భాష పై సుమారు ఎనభైకి పైగా ఆర్టికళ్ళు, పోటీ పరీక్షల కోసం ఇరవై పుస్తకాలు రాసిన రవీంద్రనాథ్, ఆంగ్ల భాషలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉపాధ్యాయునిగా, హెడ్ మాస్టర్ గా పనిచేసిన తన తండ్రి రైన స్వర్గీయ చింతల కన్నారావు తనకు నిజమైన స్ఫూర్తి అని చెప్పారు.
ప్రొఫెసర్ సోమలత గారి పర్యవేక్షణ లో ఎన్నో అమూల్యమైన విషయాలు నేర్చుకున్నానని ఆవిడకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. Ph D చేయడం లో తనకు విలువైన సూచనలు,సలహాలు ఇచ్చిన తన స్నేహితురాలు డా. B. సౌజన్య గారి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేను అని రవీంద్రనాథ్ చెప్పారు. పరిశోధనకు చేతన్ భగత్ నే ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఏమిటని వైస్ ఛాన్సలర్ గారు సంధించిన ప్రశ్నకు సమాధానం గా, "ప్రస్తుత యువత ఆలోచనావిధానాన్ని తెలుసుకోవాలన్న నాకు, భగత్ నవలలు ఒకచక్కని మార్గంగా అనిపించింది." అని చెప్పారు.