తెలంగాణ శాసనసభలో ఎన్నో ప్రత్యేకతలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా కొలువుదీరింది. సీఎం కేసీఆర్ సహా 114 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా 25 మంది సభ్యులు తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వత అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కొత్తగా కొలువుదీరిన తెలంగాణ రెండో శాసనసభలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా కొలువుదీరింది. సీఎం కేసీఆర్ సహా 114 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా 25 మంది సభ్యులు తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వత అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కొత్తగా కొలువుదీరిన తెలంగాణ రెండో శాసనసభలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
రాష్ట్ర తొలి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన 76 మంది ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికయ్యారు. 23 మంది తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు. సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యేలచే ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా సీఎం కేసీఆర్ ఎమ్మ్యెలేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ఇంగ్లీష్‌లో ప్రమాణస్వీకారం చేయగా మిగతా నలుగురు తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం అక్షర క్రమంలో మిగతా సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముందు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, జాఫర్ హుస్సేన్, టీఆర్ఎస్ సభ్యుడు మాధవరం కృష్ణారావు, టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ సభ్యుడు రాజాసింగ్ సభకు హాజరు కాకపోవడంతో ప్రమాణస్వీకారం చేయలేదు. కంటోన్మెంట్ శాసనసబ్యుడు సాయన్న అనారోగ్య కారణం చే వీల్ చైర్ సహాయంతో సభకు హాజరై ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 శాసనసభ స్థానాలకు గాను 88 మంది టీఆర్ఎస్ సభ్యులు, 19 మంది కాంగ్రెస్, ఏడుగురు మజ్లిస్, ఇద్దరు టీడీపీ, బీజేపీ తరఫున ఒక సభ్యుడు ఉన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో నలుగురు వేర్వేరు చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించిన వారున్నారు. మేడ్చల్ నుంచి ఎన్నికైన మల్లారెడ్డి, చెన్నూరు నుంచి గెలిచిన బాల్క సుమన్ లోక్‌సభ సభ్యులుగా పనిచేశారు. మునుగోడు నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతంలో లోక్‌సభ, శాసనమండలికి ప్రాతినిథ్యం వహించారు. కొడంగల్ నుంచి గెలుపొందిన పట్నం నరేందర్‌రెడ్డి కూడా మండలి సభ్యుడిగా పనిచేశారు. ఈనలుగురిని మినహాయిస్తే మిగతా 23 మంది మొట్టమొదటి సారి శాసనసభకు ఎన్నికయ్యారు.
సభలో అత్యంత సీనియర్ సభ్యుడుగా సీనియర్ కేసీఆర్ ఉన్నారు. ఇప్పటి వరకూ ఉప ఎన్నికతో పాటు ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు కేసీఆర్. తరువాతి స్థానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, ముంతాజ్ అహ్మద్‌ఖాన్ సీనియర్లుగా ఉన్నారు. ఉప ఎన్నికతో కలిపితే హరీశ్‌రావు, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ ఆరుసార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఇక సభలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎక్కువ వయసు ఉన్న సభ్యుడు కాగా, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ పిన్నవయస్కురాలు.
తెలంగాణ తొలి అసెంబ్లీలో లేని, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన 16 మంది ఈమారు మళ్లీ ఎన్నికయ్యారు. మొదటి శాసనసభకు నామినేట్ అయిన స్టీఫెన్‌సన్ మళ్లీ నామినేట్ అయ్యారు.