ఆరోవిడత అన్ని పార్టీలకు పెద్ద సవాలే. మరీ ముఖ్యంగా బీజేపీకి అంత ఈజీ కాదన్నది విశ్లేషకుల మాట. ఈనెల 12వ తేదీన 7 రాష్ట్రాల్లోని 59 స్థానాల్లో జరగనున్న ఆరోవిడత లోక్‌సభ ఎన్నికల్లో కమలనాథులు మరింత చెమటొడాల్చిన పరిస్థితి. ఎందుకు. మిగిలిన ఐదు దశల్లోనే హడావిడి. ఆరో దశకు వచ్చేసరికి ఎందుకొచ్చింది. ఇంతకీ ఏం జరుగుతోంది?
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 12న దేశవ్యాప్తంగా 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఢిల్లీలోని ఏడు స్థానాలతో పాటు, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానాల్లో సునాయాసంగా విజయం సాధించిన కమళదళం ఈసారి అనేక సవాళ్లను ఎదర్కొవల్సి వస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీ విజయం సాధించిన బీజేపీ ఈసారి కూడా అవే ఫలితాలను పునరావృత్తం చేయాలని భావిస్తోంది. కానీ అదంత సులువైన విషయంలా కనిపించట్లేదంటున్నారు విశ్లేషకులు.
ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ నుంబి బీజేపీ పోటీని ఎదుర్కొంటుంది. విజయంపై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నా 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన యూపీలో పోటీ తీవ్రంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో చిరకాల ప్రత్యుర్థులైన మాయావతి, అఖిలేష్ నేతృత్వంలోని పార్టీలు కూటమిగా ఏర్పడి విజయం కోసం ప్రయత్నిస్తున్నాయి. వారి కలయికతో యూపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. దీంతో గత ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన 71 స్థానాలను నిలుపుకోవడం అంతలేలికకాదన్నది వారి అభిప్రాయం.
యూపీలోని 14 స్థానాలకు 12న ఎన్నిక జరగనుంది. వీటిలో 12 సీట్లు బీజేపీ ఎంపీలకు చెందినవే. ఆయా స్థానాల్లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమి నుంచి బీజేపీ పోటీని ఎదుర్కొంటోంది. తానేమీ తక్కువ కాదంటూ కాంగ్రెస్ కూడా పోటాపోటీ ప్రచార సభలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్ తురుపు ముక్క ప్రియాంకగాంధీ ఇప్పటికే యూపీలో పర్యటించారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఉత్కంఠ పోటీకి బీహార్ వేదికైంది. గత ఎన్నికల్లో 30 స్థానాలకు పైగా విజయం సాధించిన బీజేపీ ఈసారి నితీష్ సారధ్యంలోని జేడీయూతో కలిసి ఎన్నికల రంగంలోకి దిగింది. 18 స్థానాలకు మే 12న పోలింగ్ జరుగనుంది. వీటిలో ఏడు స్థానాల్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. గత ఫలితాలనే మరోసారి పునరావృత్తం చేయాలని బీజేపీ భావిస్తుండగా కాంగ్రెస్, ఆర్జేడి కూటమి విజయంపై ధీమాతో ఉన్నాయి.
ఇక మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో బీజేపీ కిందిటిసారి విజయం సాధించింది. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేనేళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్‌కు పట్టంకట్టారు మధ్యప్రదేశ్ ఓటర్లు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే జోరు కొనసాగిస్తామని హస్తం నేతలు ధీమాతో ఉన్నారు. ఇలా ఏ రకంగా చూసినా ఆరో విడతలో అన్ని పార్టీలు చెమటోడ్చాల్సిన పరిస్థితే అన్న మాట మాత్రం ముమ్మాటికీ నిజం.