ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజికి చేరుకుంది. మలివిడత ఓట్ల పండగకు దేశం సిద్ధమైంది. మొత్తం 97 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సోం, బీహార్, చత్తీస్‌గఢ్, జమ్ముకశ్మీర్, కర్నాటక, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిషా, పుదుచ్చేరి, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో కొన్ని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక తమిళనాడులోని 39 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. వేలూరులో ఎన్నిక రద్దుకాగా, శాంతిభద్రతల కారణంగా త్రిపుర తూర్పు స్థానం ఎన్నికను వాయిదా వేసింది ఎన్నికల సంఘం.
తొలి విడత 91 స్థానాలకు జరుపుకున్న దేశం ఈనెల 18న జరిగే రెండోదశ ఎన్నికలకు సిద్ధమైంది. 13 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. పక్కనున్న పాండిచ్చేరిలోని ఏకైక నియోజకవర్గంలోనూ 18న పోలింగ్ జరుగుతుంది. కర్ణాటకలో 14, చోట్ల, మహారాష్ట్రలో 10 నియోజకవర్గాలు, యూపీలో 8, అసోం, బీహార్, ఒడిశాలో ఐదు చోట్ల, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లో మూడు చోట్ల, జమ్ముకశ్మీర్‌లో రెండు చోట్ల, మణిపూర్, త్రిపులో ఒక్కోచోట రెండోదశలో పోలింగ్ జరుగనుంది. యూపీలో మొత్తం 80 లోక్ సభ స్థానాలు ఉంటే.. 8 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ 8 బీజేపీ సిట్టింగ్ స్థానాలే కావడం విశేషం.
అస్సోంలో 5 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. కరీంగంజ్, సిల్చార్, అటానమస్ డిస్ట్రిక్ట్, మంగళడోయ్, నవగాంగ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక బీహార్‌లో ఐదు స్థానాలకు కృష్ణగంజ్, కతిహార్, పూర్ణియా, భగల్‌పూర్, బంకాలో ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రం చత్తీస్‌ఘడ్‌లో 3 స్థానాలు రాజ్‌నంద్‌గావ్, మహాసముంద్, కంకేర్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మరో సున్నితమైన రాష్ట్రం జమ్ముకశ్మీర్‌లో శ్రీనగర్, ఉదంపూర్ పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
దక్షిణాదిలో కర్ణాటకలోని 14 పార్లమెంట్ స్థానాలకు 18వ తేదీనే పోలింగ్ జరగనుంది. ఇందులో ఉడుపి, చిక్‌మంగళూర్, హసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తూముకూరు, మాండ్య, మైసూర్, చామరాజ్‌నగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు ఉత్తరం, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు దక్షిణం, చిక్కబళ్లాపూర్, కోలార్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇక మహారాష్ట్రలో 10 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో బుల్దానా, అకోలా, అమరావతి, హింగోలి, నాందేడ్, పర్భాని, బీడ్, ఒస్మానాబాద్, లాతూరు, సోలాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఒకే స్థానం ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ స్థానానికి ఎన్నిక జరగనుంది.
ఇక ఒడిషాలో 5 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో బర్గర్హ్, సుందర్‌గర్హ్, బోలంగిర్, కందమాల్, అస్కా నియోజకవర్గాలు ఉన్నాయి. 18నే కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో ఒక స్థానానికి ఎన్నిక జరగనుంది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోని నాగిన, అమ్‌రోహా, బులంద్ షహర్, అలిఘఢ్, హత్రాస్, మథురా, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. పశ్చిమబెంగాల్‌లో మూడు నియోజకవర్గాలు జల్‌పాయిగురి, డార్జీలింగ్, రాయిగంజ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. రెండో విడత ఎన్నికల్లో తమిళనాడులోని వేలూరు నియోజవకర్గానికి పోలింగ్ రద్దు కాగా... త్రిపురా తూర్పు స్థానం శాంతిభద్రతల కారణంగా ఎన్నికను వాయిదా వేసింది ఈసీ. ఇక మిగతా అన్ని చోట్ల పోలింగ్ జరగనుంది. ఇందులో పలువురు హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. కొన్ని కొత్త ముఖాలు పార్లమెంటులో అడుగుపెట్టేందుకు తమవంతు కృషిచేస్తున్నారు.