చలి గజగజా వణికిస్తోంది. తెలంగాణజిల్లాలు చలి పంజా ధాటికి వణికిపోతున్నాయి. నవంబర్‌లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంలో చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు వణికిపోతున్నారు. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి చలిగాలులు వీస్తుండటంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. నాలుగైదు రోజులుగా చలితీవ్రత పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. గత కొద్దిరోజుల వరకు అంతంత మాత్రంగానే ఉన్న చలి ప్రభావం ఒక్కసారిగా ఉద్ధృతరూపం దాల్చడంతో అల్లాడిపోతున్నారు. రాత్రి వేళ్లలో కనిష్ట ఉష్ణోగ్రత ఏకంగా ఐదు డిగ్రీలకు పడిపోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారు.
ఉత్తర, ఈశాన్య భారతం నుంచి చలిగాలులు వీస్తుండటంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగానూ రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. మొన్నటిదాకా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 నుంచి 22 మధ్య ఉన్న ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోవడంతో చలితీవ్రత పెరిగింది. ఇటు... ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను మంచుదుప్పటి కప్పేసి కనిష్ట ఉష్ణోగ్రతలతో వణికిస్తోంది. ఇక్కడ.. కొద్దిరోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు 12డిగ్రీలుగా రికార్డవడం చలి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇటు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నగరవాసులు అల్లాడిపోతున్నారు.
ఇలా... గతంలో ఎన్నడూ లేనివిధంగా నవంబర్‌లోనే రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతుండటం... జిల్లాల్లో టెంపరేచర్ దారుణంగా పడిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. డిసెంబర్‌లో మొదలు కానున్న చలి తీవ్రత నవంబర్‌లోనే చుక్కలు చూపించడంతో భయాందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే జనవరి వచ్చేసరికి మంచు తీవ్రత ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. చలి తీవ్రతతో సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశమున్నందున జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. మఫ్లర్, జర్కిన్, మంకీక్యాప్, స్వెట్టర్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు.