తెలుగులో పుట్టి తమిళనాడులో పెరిగి సినిమాల్లో రాణిస్తున్న హీరో విశాల్ కృష్ణారెడ్డి నేడు సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో కాళీ ఏర్పడిన ఆర్కే నగర్ ఉపఎన్నిక స్థానానికి విశాల్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.. వాస్తవానికి ఈ ఉపఎన్నిక ఏప్రిల్ నెలలో జరగాల్సి ఉండగా తీవ్రంగా రాజకీయ పార్టీలు డబ్బు పంచుతున్నాయని ఎన్నికల కమిషన్ ఎన్నికను వాయిదా వేసింది.. ఈ క్రమంలో ఈ నెలలో జరగాల్సిన ఉపఎన్నికకు ఇప్పటివరకు 26 నామినేషన్స్ లు దాఖలయినట్టు తెలుస్తుంది..
కాగా ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు ప్రకటించి సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించిన నటుడు విశాల్ ఏ లక్ష్యంతో ఎన్నికల్లో పోటీచేస్తున్నారో స్పష్టత ఇచ్చారు. ‘‘ఎన్నికల్లో గెలుపోటముల గురించి నేను ఆలో చించడం లేదు. ప్రజలకు సేవ చేసేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నా. నా అంత రాత్మ ఎన్నికల్లో పోటీచేయమని చెప్పింది. ఇదేదో ఇప్పటికిప్పుడు ఆకస్మికంగా తీసు కున్న నిర్ణయం కాదు. గత 12 నెలలుగా ఆర్కేనగర్‌తో, అక్కడి ప్రజలతో నాకు అను బంధం ఉంది. ఆర్కేనగర్ అభివృద్ధికి, పౌర సేవలు మెరుగుపరిచేందుకు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, అవేమి నెరవేరలేదు. ప్రజలకు ఏదైనా చేయాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను. అందుకోసం చాలాకాలంగా యోచిస్తున్నాను. అక్కడి పరిస్థితులే నన్ను ఉపఎన్నికల్లో పోటీచేయడానికి దారిచూపాయని అయన విశాల్ అన్నారు..