దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజేశేఖరరెడ్డి కుమారుడు ప్రస్తుత ఏపీ ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి మీద తనకు ప్రేమ లేకుండా ఎందుకు ఉంటుంది? అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. తాను రాజకీయంగా ఇంతటి జ్ఞానాన్ని సంపాదించడానికి వైయస్ కారణమయినప్పుడు అయన కుమారుడిమీద సహజంగానే అతనిపై మంచి అభిప్రాయం ఉంటుందని ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ చెప్పారు.. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంగి సలాములు చేస్తున్నారని, అందుకే కేంద్రంలో ఉన్నవారికి అలుసైపోయామని అన్నారు. అలా కాకుండా చంద్రబాబు గట్టిగా నిలబడి బల్లగుద్ది ప్రశ్నిస్తే విషయం తేలిపోతుందని ఆయన చెప్పారు. ఇక చంద్రబాబు చెబుతున్న అమరావతిని తాను చూడలేనని ఆయన అన్నారు. అంతేకాదు అయన చేసిన అప్పులకు రాష్ట్రము దివాళా తీసే ప్రమాదముందని హెచ్చరించారు..