మరోసారి జనాలను పిచ్చివాళ్ళను చేయడానికి పవన్ కళ్యాణ్ బయలుదేరారని, టీడీపీపీపై వ్యతిరేకత పెరుగుతుందన్న తరుణంలో పవన్ బయటికొచ్చి తెలుగుదేశం పార్టీని రక్షించేలాగా వ్యహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మ ఈ వ్యాఖ్యలు చేసారు.. పవన్ కళ్యాణ్ కేవలం టీడీపీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు..
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన దాదాపు ఆరువందల హామీల్లో పవన్ కు భాగముందని అవి నెరవేర్చేందుకు కృషి చేయాల్సింది పోయి ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడటమేంటని ఆమె అన్నారు.. అంతేకాదు గత నాలుగేళ్లనుంచి టీడీపీ చేస్తున్న తప్పిదాలను ఒక్కసారైనా ప్రశ్నించారా..? ఏమైనా అంటే కిందకి చూసి నాకు ఎవరితో శత్రుత్వం లేదు అంటారు అసలు దానికి దీనికి సంభంధమేంటని ఎదురు ప్రశ్నించారు.. ప్రతిసారి ఇంతే ఏదో ఒక యాత్రను తీసుకోవడం ప్రతిపక్షాన్ని తిట్టడం ఇలా ఎంత కాలం ప్రజల్ని మోసం చేస్తారో మేము చూస్తామని ఆమె చెప్తూ పవన్ కు తిరిగి కొన్ని ప్రశ్నలు సందిచారు అవేంటో చూడండి..