సణుగుడు సరే... గులాబీలో ఈ గుట్టు మాటేంటసలు?

Update: 2018-10-23 08:07 GMT

తెలంగాణ కాంగ్రెస్, మహా కూటమి పేరుతో పొత్తులకు తెరలేపింది. ఎన్నికల షెడ్యూల్ సమయం దగ్గపడుతున్నా...నేటికీ సీట్లు సర్డుబాటు అంశం కొలిక్కి రాలేదు. దీన్ని పక్కనపెట్టి పిసిసి నేతలు ప్రచారంపై దృష్టి పెట్టారు. ప్రచార కమిటి పర్యటనలతోపాటు, ఏఐసిసి అధినేత రాహుల్ పర్యటలను విసృతంగా చేస్తున్నా, పార్టీలో సీట్ట సర్డుబాటుపై ఒక కన్‌క్లూజన్‌ రాకపోవడం, పార్టీనేతలకు మింగుడుపడడం లేదు. అభ్యర్దుల ప్రకటించకుండా, రాహుల్‌తో ప్రచార సభలను పెట్డడాన్ని, పార్టీలో కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. సీట్లు రాని వాళ్లను బుజ్జిగించాల్సిన సయమంలో భారీస్థాయిలో సభలు పెట్టడం, కార్యకర్తలకు ఆర్థికభారం కాదా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ అభ్యర్దుల ఖరారుకాక పోవడం వల్ల ఓటు ఎవ్వరికి వేయాలనే చర్చ కూడా వినిపిస్తోంది. రాహుల్ సభలు నిర్వహించిన నియోజికవర్గాల్లో, పొత్తుల్లో సీట్లు పోతే పార్టీ అభ్యర్థిని ఎలా బుజ్జగిస్తారని కొందరు నేతలు మథనపడుతున్నారు.

వీటితోపాటు, వలసవాదులకు బీఫాం రాదని కాంగ్రెస్ అధినేత ప్రకటించినా...ఆనవాయితి మారేలా కనిపించడం లేదు. ప్యారాచూట్‌లకు టిక్కెట్టు ఉండవని బహిరంగంగా రాహుల్ గాంధీ చెప్పారు. అయితే టిఆర్ఎస్ నుంచి రావడానికి సిద్దంగా ఉన్న నేతలకు, కాంగ్రెస్ టికెట్‌ ఖరారు చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీలో నేతలకు మింగుడుపడడం లేదని చర్చ జరుగుతోంది. ఇలా పార్టీలోకి రాకముందే వారికి సీట్లు కేటాయిస్తామని పార్టీలో చర్చ జరగడం వల్ల, ఆయా నియోజకవర్గాల్లో రాహుల్‌ సభతో, ఒరిగిందేమిటని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక పార్టీనేతలు రాహుల్ గాంధీ సభలు పూర్తయి రెండు రోజులు గడుస్తున్నా, ఆ జోష్‌ను కంటిన్యూ చేసేందుకు తరువాతి కార్యక్రమాలు చేపట్టలేదు. రెండు రోజులుగా రాహుల్ టూర్‌పై టిఆర్ఎస్, బిజేపి ముప్పేట మాటల దాడి చేస్తున్నా, కాంగ్రెస్ నేతలు మాత్రం హాలిడే మూడ్‌లోంచి ఇంకా బయటకు రాలేదు. మొత్తానికి, రాహుల్ పర్యటన పార్టీలో కొత్త జోష్ నింపినా, అభ్యర్దులు ఖరారు కాకపోవడం, పార్టీలో అయోమయ పరిస్థితికి కారణమవుతోంది. సీట్ల సర్డుబాటు, బుజ్జగింపులు చేసి, పార్టీలో విభేదాలు లేవని చెప్పాల్సిన నేతలు, కేవలం ప్రచారంపై నిఘా పెట్టడం ఏమిటనే చర్చ పార్టీలో జరుగుతోంది. వచ్చే రాహుల్ పర్యటన నాటికన్నా.... సీట్లు సర్దుబాటు పూర్తి చేసి తమ అభ్యర్దుల ఉన్న చోట సభలు పెట్టాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది.

Similar News