గులాబీదళంలో కేటీఆర్‌ది తారకమంత్రం. అన్నీ తానై నడుస్తూ... అందరిని తానై నడిపిస్తూ ఎన్నికల్లో అత్యంత కీలకంగా వ్యవహరించారు కేటీఆర్. సెటిరట్ల ఓటర్లను గెలిచే విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యహరించారు. రెండేళ్ల కిందటి గ్రేటర్ ఎన్నికల నుంచి తాజా ఎలక్షన్ల కార్యాచరణలో కేటీఆర్ కీలక భూమిక పోషించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో తండ్రి కేసీఆర్‌కు తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు కేటీఆర్.
కేసీఆర్ వారసత్వం రాజకీయంలోనే కాదు... మాటల్ని తూటాల్లా పేల్చడంలోనూ కేటీఆర్‌ది అందెవేసిన చెయ్యి. అచ్చం తండ్రి తరహాలోనే మాటల తూటాలను పేల్చడంతోపాటు రాజకీయ వ్యూహరచనలోనూ భాగస్వామిగా వ్యవహరించారు. టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. దీనికి అనుగుణంగా కేసీఆర్.. కేటీఆర్‌ను సన్నద్ధం దాదాపు 39 నియోజకవర్గాల్లోని అభ్యర్థులు, అసమ్మతి నేతలను బుజ్జగించి.. నాయకులందరినీ ఏకతాటిపైకి తేగలిగారు. జంట నగరాల్లోని 24 నియోజకవర్గాలకు తోడు రాష్ట్రవ్యాప్తంగా మరో 46 నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం చేసి అన్నీ తానై చక్రం తిప్పారు.
వాయిస్9: ప్రచారంలో కేసీఆర్ తరహాలోనే వాగ్ధాటిని ప్రదర్శించారు కేటీఆర్. ప్రత్యర్తి పార్టీల ప్రసంగాలు, వ్యాఖ్యలను ఎదుర్కొంటూ, వారికి దీటైన సవాళ్లు చేశారు. గ్రేటర్‌లోని చాలా నియోజకవర్గాల్లో స్థిరపడిన వారి మనస్సులను గెలిచేలా అమలు చేసిన ప్రణాళిక విజయవంతమైంది. గ్రేటర్‌లో ఎక్కువ స్థానాలను గెలవాలని భావించి కేసీఆర్ ఈ బాధ్యతను కేటీఆర్‌కు అప్పగించారు. నియోజకవర్గాల్లో రోడ్డుషోలు చేసి ప్రత్యర్థులపై విమర్శల దాడి చేశారు కేటీఆర్. రోజువారీ ప్రణాళికతో గ్రేటర్‌లోని 24 స్థానాలపై దృష్టిసారించడంతో 14 స్థానాల్లో విజయదుందుభి మోగించడంలో కేటీఆర్ పాత్ర అమోఘమంటోంది గులాబీదళం.
గ్రేటర్ ఎన్నికల్లో కూడా నాన్నకు ప్రేమతో అంటూ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు కేటీఆర్. ఎక్కడెక్కడ ఎవరు అవసరం.. ఏ ఇష్యూను ఎవరు డీల్ చేయగలరు... ఇలా గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేసి తన రాజకీయ పరిణితి చాటుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ సీట్లు సాధించటంలో ప్రధాన పాత్ర పోషించిన కేటీఆర్.... సెటిలర్లు ప్రభావితం చేసే నియోజకవర్గాలను చుట్టొచ్చి వారిని ఒప్పించగలిగారు. ఇలా పార్టీపైనా... రాజకీయాలపైనా తిరుగులేని పట్టు సాధించిన కేటీఆర్‌ను.... తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు కేసీఆర్.
మొదటి నుంచీ అనుకున్నట్టుగానే కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో క్రమంగా క్రియాశీలంగా మారుతూ వచ్చారు. కేసీఆర్ కూడా తన కుమారుడికి ఒకేసారి పదవులు ఇవ్వడం కాకుండా ఒక్కో బాద్యతా పెంచుతూ వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఐటి శాఖతో మొదలుపెట్టి దాదాపు 13 శాఖలకు మంత్రిగా వ్యవహరించారు కేటీఆర్. ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు పార్టీ వర్గాలకు తాను అందుబాటులో ఉంటూ వచ్చారు. పార్టీలో రెండో స్థానం ఇవ్వడం ద్వారా తన తరువాత అన్ని నిర్ణయాధికారాలూ కేటీఆర్‌వే అని పరోక్షంగా ప్రకటించేశారు కేసీఆర్. ఉద్యమ కాలంలో రాజకీయ ప్రవేశం చేసిన కేటీఆర్... తనను తాను మలచుకుంటూ, నిఖార్సయిన రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుకున్నారు. ఎదురులేని శక్తిగా ఎదుగుతూ వచ్చారు.