పెట్టుబడి లేని పేద రైతు అరక దున్నడానికి కాడెడ్లు లేవు అయినా కన్నీళ్లూ పెట్టుకోలేదు ఆ రైతు. పత్తి చేనులో గడ్డి తీయడానికి పైసలు లేవని పరేషాన్ కాలేదు అరక దున్నడానకి కాడెద్దుగా మారి ముందుకు సాగాడు. చేతులపై హలం పెట్టుకుని భార్య సాయంతో పంట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న అన్నదాతపై ప్రత్యేక కథనం
మనం చూస్తున్న ఈ వృద్దదంపతులది సొంతూరు నిర్మల్ జిల్లా బైంసా అరక దున్నేందుకు కాడెడ్లు కూడా లేకపోవడంతో భార్య సాయంతో తానే నాగలి దున్నకుంటూ పండిన పంటతో కాలం వెళ్లదీస్తున్నాడు రైతు గంగారం. స్థానికంగా ఉన్న గడ్డెన్న ప్రాజెక్టు నిర్మాణంలో వీరికున్న నాలుగు ఎకరాల భూమి కోల్పోయారు. ప్రభుత్వం అందిస్తామన్న సాయం వీరికి అందలేదు. ఉన్న అర ఎకరం వ్యవసాయ భూమిలో పంట సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు
ఉండేందుకు ఇళ్లు కూడా సరిగా లేదని పొలం దున్నుకోని సాగు చేసుకోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు గంగారం. కూలీలతో పని చేయిద్దామనుకున్నా ఆర్దిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని చెబుతున్నాడు. ఇటీవల రైతు బంధం పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల రూపాయలతో ఉన్న అర ఎకరంలో పంటపెట్టుబడి పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించి వృద్ధాప్యంలో ఉన్న తమను ఆదుకోవాలని ప్రాధాయపడుతున్నారు గంగారాం దంపతులు. రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న సర్కార్ గంగారం దంపతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.