శ్యామ్ హత్యకి, యాపిల్ పండుకి లింకేంటి...యాపిల్ పండులోని ఆ విషమేంటి..?
అదో ఎర్రని పండు. చూడగానే నోరూరిస్తుంది. ఆపై తినాలనిపిస్తుంది. తింటుంటే మధురాతి మధురంగా ఉంటుంది. అదే యాపిల్ పండు. ఈ తియ్యని పండులో కానరాని విషముంది. ఆదమరచి తింటే మనిషి అంతు చూస్తుంది. తాజాగా కేరళకు చెందిన శ్యామ్ మర్డర్ మిస్టరీలో ఓ కొత్తకోణం వెలుగు చూసింది. ఇంతకీ శ్యామ్ హత్యకి, యాపిల్ పండుకి లింకేంటి..? యాపిల్ పండులోని ఆ విషమేంటి..?
ఔను వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కేరళ నుంచి ఆస్ట్రేలియా వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ భార్యే మరో వ్యక్తితో కలిసి భర్తను చంపేసింది. అయితే ఆ హత్యకు కత్తి, సుత్తి లాంటివి వాడలేదు. చాకు బాకు కూడా ఉపయోగించలేదు. కేవలం ఓ ఫలం. ప్రతిఫలంగా భర్త ప్రాణాలు కోల్పోయాడు. కేరళకు చెందిన శ్యామ్ అబ్రహాం సోఫియా ఇద్దరూ భార్యభర్తలు. ఇద్దరూ అనోన్యంగా ఉంటున్న సమయంలో హఠాత్తుగా శ్యామ్ అబ్రహాం చనిపోయాడు. ఆ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరా తీయగా కేవలం శ్యామ్ సైనైడ్‌తో చనిపోయాడని తేల్చారు.
శామ్ అబ్రహాం. ఓ సింగర్. కేరళలోని కొల్లం జిల్లాలో చర్చిలో పాటలు పాడుతుండేవాడు. సోఫియా కూడా చర్చ్‌లోని ప్రార్థన గీతాల టీమ్‌లో ఓ గాయని. ఆ ఇద్దరి కుటుంబాలు దగ్గర్లోనే నివశిస్తుంటాయి. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇంట్లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కొడుకు పుట్టగానే ఉద్యోగ రీత్యా సోఫియా ఆస్ట్రేలియాకి వెళ్లిగా, శ్యామ్ ఒమన్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో సోఫియా శ్యామ్‌ని ఆస్ట్రేలియా రమ్మంటే, శ్యామ్ సోఫియాని ఒమన్ రమ్మన్నాడు. చివరికి సోఫియా కోరిక మేరకు శ్యామ్ ఆస్ట్రేలియా చేరుకున్నాడు.
ఇలా అంతా హ్యాపీగా సాగుతున్న సమయంలో శ్యామ్ ఓ రోజు శవమై కనిపించాడు. సోఫియా భర్త బాడీతో కేరళ చేరుకుంది. అంత్యక్రియలు ముగిశాక తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయింది సోఫియా. అయితే శ్యామ్‌ది అసాధారణ మరణం కాబట్టి ఆస్ట్రేలియా పోలీసులు పోస్టుమార్టం చేయించారు. కొన్ని నెలల వరకూ సోఫియా జోలికి వెళ్లని పోలీసులు ఆమె కదలికలపై నిఘా పెట్టారు. ఇంతలో అటాప్సీ రిపోర్టులో శ్యామ్ రక్తంలో సైనైడ్ కనిపించింది. అంతే ఇంతకీ శ్యామ్‌ది ఆత్మహత్యా లేదా హత్యా అన్న కోణంలో విచారణ మొదలైంది.
శ్యామ్ డెత్ మిస్టరీ విచారణలో అరుణ్ పేరు ఎంటరయ్యింది. ఇంతకీ ఈ అరుణ్ ఎవరు..? అన్న విచారణ చేపడితే, కేరళలో సోఫియాతో కలిసి చదువుకున్న వ్యక్తి. అరుణ్ కూడా పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. పిల్లలు కూడా ఉన్నారు. కానీ అరుణ్ ప్రేమను మర్చిపోలేని సోఫియా భర్త హత్యకు స్కెచ్ వేసింది. అయితే పోలీసు ప్రాథమిక నివేదికలో ఆరెంజ్ జ్యూస్‌లో సైనైడ్ కలిపి శ్యామ్‌ని చంపినట్టు పేర్కొన్నారు. సోఫియాకి 22 ఏళ్లు, అరుణ్‌కి 27 ఏళ్లు జైలు శిక్ష పడింది.
తీయని యాపిల్ చూడగానే నోరూరించే ఫలం. తింటుంటే ఆ టేస్టే మధురం అలాంటి యాపిల్ ఇప్పుడు విషయమయ్యిందా..? కమ్మని యాపిల్ కిల్ చేస్తోందా..? యాపిల్‌లో సైనైడ్‌లో ఉంటుందా..? అసలు యాపిల్ పండులో దాగున్న విషమేంటి..? విషయమేంటి..?
ఆస్ట్రేలియా పోలీసులంతా మొదట శ్యామ్‌ని ఆరెంజ్ జ్యూస్‌లో సైనైడ్ కలిపి తాగించి చంపారనే అనుకున్నారు. నేరస్తులు సోఫియా, అరుణ్ కూడా అదే అంగీకరించారు. కానీ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన నిజం ఏంటంటే..? అసలు నేరస్థులిద్దరికీ సైనైడ్ ఎక్కడి నుంచి వచ్చింది..? సైనైడ్‌ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు..? ఈ ప్రశ్నలపై ఆరా తీస్తే విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది.
యాపిల్ సీడ్స్‌ని నలగ్గొట్టి వాటిని జ్యూస్‌లో కలిపి తాగించారు నేరస్థులిద్దరూ. అందుకే శ్యామ్ ప్రాణాలు కోల్పోయాడని తాజాగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ యాపిల్ సీడ్స్ అంత విషమా..? యాపిల్ విత్తనాలు తింటే చనిపోతారా..?
యాపిల్ పండుని చిన్నారుల నుండి పెద్దల వరకూ అందరూ ఇష్టపడుతారు. అయితే యాపిల్ తినేటప్పుడు సాధ్యమైనంత వరకు ఆ విత్తనాలను తీసేసే తింటాం. కానీ అప్పుడప్పుడు పొరపాటున విత్తనాలు తినేస్తాం. కానీ యాపిల్ విత్తనాలు తింటే విషమనే చేదు నిజం ఇటీవలే బయటికి వచ్చింది. ఇది తెలిసీ అందరూ భయాందోళనకు గురవుతున్నారు.
యాపిల్ సీడ్స్‌ని నలగ్గొట్టి తింటే ప్రాణాలు పోతాయా..? అంటే అవుననే అంటున్నారు వైద్యులు. యాపిల్ విత్తనాలు అత్యంత ప్రమాదకరమని, ఒకటి అర అయితే ఇబ్బంది ఉండద కానీ, ఎక్కువగా తింటే అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు.
యాపిల్ గింజల్ని గింజలాగా మింగేస్తే ఏ ప్రమాదం ఉండదు. కనీ పంటికింద నలిగినా, వాటిని నలగ్గొట్టుకుని తిన్నా అందులోని అమిగ్డాలిన్ హైడ్రోజన్ సైనైడ్‌గా మారుతుంది. అది మనిషి ప్రాణాలమీదకి వస్తుంది. బాగా నలగ్గొట్టిన యాపిల్ సీడ్స్ పుంచి 0.06 నుంచి 0.24 మిల్లీగ్రాముల సైనైడ్ వస్తుంది. అదే 100 గ్రామలు సీడ్స్ అయితే 6 నుంచి 24 మిల్లీగ్రాములు సైనైడ్ వస్తుంది. ఇలా విత్తనాల మోతాదు పెరిగే కొద్దీ మనిషి ప్రాణాలు పోయే ప్రమాదుముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.