నందమూరి ఇంట ‘రహదారి విషాదాలు’ ...మూడు తరాలను వెంటాడిన రోడ్డు ప్రమాదాలు

Update: 2018-08-30 06:12 GMT

అతి వేగం ప్రమాదకరం యాక్సిడెంట్‌ వల్ల మేము ఇప్పటికే మా ప్రియ సోదరున్ని కోల్పోయాము. ఆ పరిస్థితి మరేవరికి రావద్దు అనే మాటలు ఈ మధ్య విడుదలైన నందమూరి వారసుల చిత్రాల ప్రారంభానికి ముందు వచ్చే  వినిపించే స్లోగన్‌. కానీ ఆ అతివేగమే నందమూరి కుటుంబం పాలిట శాపమవుతోంది.తాత  కొడుకు, హరికృష్ణ మరణంతో కలిపి ఇప్పటికే వారి ఇంట మూడు యాక్సిడెంట్లు జరిగాయి. నందమూరి ఫ్యామిలీని మూడు తరాలుగా హడలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాల పరంపరను ఓ సారి చూడండి.

నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి.  విధి వక్రీకరణతో మూడు తరాల నందమూరి  వారసులను రోడ్డు ప్రమాదాలు మింగేసాయి.  తాత, కొడుకును వెంటాడుతూ వచ్చిన ప్రమాదాలు నందమూరి హరికృష్ణను బలిగొన్నాయి.  సీనియర్‌ ఎన్టీఆర్‌  తండ్రి లక్షయ్య చౌదరి,  హరికృష్ణ కుమారుడు, జానకిరామ్‌ ఇప్పుడు హరికృష్ణ  రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.   

1976లో రామకృష్ణ స్టూడియో నిర్మించిన సీనియర్ ఎన్టీఆర్‌ నిర్వాహణ బాధ్యతలను తండ్రికి అప్పగించారు. ఓ రోజు స్టూడియో నుంచి వస్తుండగా  రాజేంద్రనగర్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో తీవ్రంగా కలత చెందిన ఎన్టీఆర్‌ స్టూడియోకు చెందిన 250 ఎకరాల పొలాన్ని అమ్మేశారు.  
 
2014లో నల్గొండ జిల్లా ఆకుపాముల దగ్గర హైవేపై హరికృష్ణ పెద్దకొడుకు జానకీ రామ్‌ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.  అంతకు ముందు 2009 మార్చిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  జూనియర్‌ ఎన్టీఆర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  టీడీపీ  తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని వస్తుండగా మోతె దగ్గర కారు బోల్తా పడటంతో తీవ్ర గాయాలపాలయ్యారు. గతంలోనే  జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ సోదరుడు త్రివిక్రమ్‌రావు, హీరోబాలకృష్ణ, మరో కుమారుడు జూనియర్ రామకృష్ణ, గాయాలతో బయటపడ్డారు.  

నల్గొండ జిల్లాలోనే హరికృష్ణతో పాటు కుటుంబ సభ‌్యులకు వరుస ప్రమాదాలు జరగడం ఇందులో ఇద్దరు చనిపోవడం ఆత్మీయులతో పాటు అభిమానులను కలవరపరుస్తోంది. ఫ్యామిలీమెంబర్స్‌ మాత్రం తమకు రోడ్డు ప్రమాదాలు శాపంగా మారాయంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. .

Similar News