బంధువుల పార్టీలు, సంగీత్, పెళ్లి, బారాత్, కాలేజ్ కల్చరల్ ఫంక్షన్స్‌లో...పాదం కదుపుతూ సాహో రే సంజీవ్ అనేలా పర్‌ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇటీవల తన బామ్మర్ధి పెళ్లిలో భాగంగా...లేడీస్ స్పెషల్ సంగీత్ కార్యక్రమం జరిగింది. ఇందులో కపుల్స్ డ్యాన్స్ వేయాలని చెప్పడంతో...సంజీవ్ శ్రీవాస్తవ, భార్య అంజలితో స్టేజ్ ఎక్కారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డ్యాన్స్ అంటే విపరీతమైన పిచ్చి....ఇంకేముందీ గోవిందా, నీలం నటించిన ఖుదాగర్జ్ మూవీలోని పాటకు స్టెప్పులు ఇరగదీశాడు.
పేరు సంజీవ్ శ్రీవాస్తవ. మధ్యప్రదేశ్‌లోని విదిషా స్వస్థలం. బాబా యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. సంజీవ్ శ్రీవాస్తవకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చాలా ఇష్టం. తల్లి వంట చేసేటపుడు టీవీల్లో గోవిందా స్టెప్పులను...నిరంతరం ఫాలో అయ్యేవాడు. అలా డ్యాన్స్‌ల్లో మెళుకువలు నేర్చుకొని...1982 నుంచి 1990ల వరకు స్టేజ్ షోలు ఇచ్చారు. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం రావడంతో విరామం ఇచ్చారు. డ్యాన్స్ లేకుండా ఉండలేకపోయారు సంజీవ్...కొంతకాలానికి మళ్లీ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు.
ఈ పాట ఒక్కటే కాదు....చోటీ జవానీ పాటకు కేక పుట్టించేలా డ్యాన్స్ వేస్తూ... ప్రొఫెషనల్ డ్యాన్సర్లు ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. బడేమియా చోటేమియాలోని గోవిందా, రవీనా టాండన్ నటించిన...కిసి డిస్కో మే జాయే సాంగ్‌కు ఇంట్లో అదుర్స్ అనిపించేలా...స్టెప్పులు వేస్తూ ప్రొఫెషనల్ డ్యాన్సర్లనే మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాడు. సంగీత్‌లో భార్య అంజలి సైతం...డ్యాన్స్ చేస్తూ సంజీవ్ శ్రీవాస్తవను ప్రొత్సహిస్తోంది.
మా వీడియో వైరల్ అవడం...జనం లైక్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు సంజీవ్ శ్రీవాస్తవ భార్య అంజలి శ్రీవాస్తవ. మా వీడియోను చూసిన తర్వాత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గ్వాలియర్ నుంచి బంధువులు ఫోన్ చేసి అభినందిస్తున్నట్లు చెప్పారు. సంజీవ్ శ్రీవాస్తవ స్టెప్పులను సోషల్ మీడియా ద్వారా చూసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్...ప్రశంసలతో ముంచెత్తారు.