ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తా? ప్రభుత్వ అవినీతిపై పోరాడతానంటూ పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రజా పోరాట యాత్రకు బ్రేకిచ్చి... దాదాపు నెలరోజులు దాటిపోతోంది. కంటి ఆపరేషన్‌తో యాత్రకు విరామిచ్చిన జనసేనాని... మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక జనసేన నేతలు, కార్యకర్తల్లో అమోమయం గందరగోళానికి గురవుతున్నారు. మూడు జిల్లాలు ముగిసేలోపే మూడుసార్లు బ్రేకిచ్చిన పవన్... మిగతా జిల్లాల్లో... ఎప్పుడు పోరాట యాత్రను కంప్లీట్ చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు పోరాట యాత్ర ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు.
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానంటూ ప్రకటించి... అన్నట్లుగానే ఉధృతంగా ప్రజా పోరాట యాత్రను చేపట్టిన జనసేనాని పవన్ కల్యాణ్‌కి... ఉత్తరాంధ్ర ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. శ్రీకాకుళం ఇచ్ఛాపురం నుంచి మొదలుపెట్టిన యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. చెప్పినట్లుగానే ఉత్తరాంధ్ర సమస్యలపై పవన్ గళమెత్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో దాదాపు 40రోజులపాటు పోరాట యాత్ర నిర్వహించారు. రోజుకి రెండుమూడు రోడ్‌షోలతో అన్ని నియోజకవర్గాలను టచ్ చేశారు. అధికార ప్రతిపక్షాలపై ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యంగా అధికార పార్టీని, ప్రభుత్వమే టార్గెట్‌గా యాత్ర కొనసాగించారు. తెలుగుదేశం ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతోందంటూ ఆరోపణలు చేశారు. ప్రతిపక్షంపైనా విరుచుకుపడ్డ పవన్.... ప్రజాసమస్యలపై పోరాటడంలో వైసీపీ విఫలైమందని విమర్శించారు.
ఇలా తన పోరాట యాత్రతో జనసేన కార్యకర్తల్లో నూతనోత్సహం నింపిన పవన్ కల్యాణ్... పార్టీ బలోపేతానికి ప్రయత్నించారు. అయితే ఉత్తరాంధ్ర టూర్ తర్వాత పశ్చిమగోదావరి నుంచి పోరాట యాత్రను ప్రారంభించిన పవన్.... 10రోజులకే బ్రేకిచ్చారు. కంటికి ఆపరేషన్ కారణంగా విరాయం తీసుకున్నారు. అయితే యాత్రకు బ్రేకిచ్చి నెల రోజులు దాటిపోవడంతో... మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే తెలియక... పార్టీలో అమోమయం గందరగోళం నెలకొంది. పవన్ పోరాట యాత్రతో కార్యకర్తల్లో మంచి జోష్ వచ్చిందని, అయితే ల్యాంగ్ గ్యాప్ రావడంతో మళ్లీ డీలా పడిపోయారని పార్టీ నేతలు అంటున్నారు. అయితే కంటి ఆపరేషన్ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్... పూర్తిగా కోలుకున్న తర్వాతే యాత్రను ప్రారంభిస్తారని జనసేన ముఖ‌్యనేతలు చెబుతున్నారు.