నేడు అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈనెల 15వతేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.పార్లమెంటులో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. కాగా... పోలవరం ప్రాజెక్టు , ప్రత్యేక హోదా వంటి విషయాల్లో ఏర్పడ్డ గందరగోళాన్ని పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలనే విషయంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్ర ఆదివారం అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం కొంటక గ్రామం నుంచి ప్రారంభం కానుంది. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర ఆదివారం నాటికి 31వ రోజుకు చేరుకుందని పార్టీ నేతలు తెలియజేసారు..