ఏపీలో ఆపరేషన్‌ గరుడ నిజమవుతుందా?

Update: 2018-10-26 11:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్‌ గరుడ నిజమేనా..? టీడీపీ నేతలు ఆపరేషన్‌ గరుడ నిజమని నమ్ముతున్నారా..? ఏపీలో ఐటీ దాడులు , ఆ తర్వాత నేతలపై కేసులు, ఇప్పడు జగన్‌పై కత్తి దాడి...ఇదంతా ఆపరేషన్‌ గరుడలో భాగమా..? సాక్షాత్తూ సీఎం చంద్రబాబు కూడా అంతా శివాజీ చెప్పినట్లే జరుగుతోందని భావిస్తున్నారా..? హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ గతంలో సంచలనంగా మారింది. అప్పట్లో టీడీపీ నేతలు ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడకపోయినా ఆ తర్వాత ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూనే ఉన్నారు. శివాజీ చెప్పినట్లు.. కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపీని కేంద్రం టార్గెట్ చేస్తుందని గతంలో స్వయానా చంద్రబాబే చెప్పారు. ఆ తర్వాత టీడీపీ నేతల ఇళ్ళలో ఐటీ దాడులు జరగడం, 8 ఏళ్ళ నాటి బాబ్లీ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కేసులో సీఎం చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేయడం. ఇటీవల టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇళ్ళు, కం.పెనీల్లో ఐటీ సోదాలు జరగడంతో ఆపరేషన్ గరుడ నిజమేనని టీడీపీ నేతలు అంటున్నారు.

ఏపీ విపక్ష నేతలపై దాడి ఆపరేషన్ గరుడ ప్లానింగేనని టీడీపీ నేతలు అంటున్నారు. ఏపీలో ఓ నేతపై దాడి జరిగే అవకాశం ఉందని అప్పట్లో హీరో శివాజీ గ్రాపులు గీసి మరీ వివరించారని చెబుతున్నారు. జగన్ పై దాడి ఘటన తర్వాత స్పందించిన సీఎం చంద్రబాబు కూడా హీరో శివాజీ చెప్పినట్లే వరుసగా ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రెండుసార్లు రెక్కీ చేసి.. మూడోసారి ప్రాణాపాయం లేని రీతిలో దాడి చేస్తారని ఆపరేషన్ గరుడ‌లో భాగంగా శివాజీ చెప్పినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మొత్తానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిపై విశాఖలో జరిగిన దాడి వల్ల ఆపరేషన్ గరుడ మరోసారి వార్తల్లో నిలచింది. 

Similar News