తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని రాజకీయ అనైతికతకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి నెల్లూరు ఎంపీ మేకపాటి లేక రాసారు.. ఇలాంటి కార్యకలాపాలు భవిషత్ లో చాల ప్రమాదకరమని, పిరాయింపుల్ని ఇలాగె ప్రోత్సహిస్తే భవిషత్ ప్రస్నార్ధకం అవుతుంది, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని... పార్టీ మారిన వారిపై సభాపతులు చర్యలు తీసుకోకుండా వారిని ప్రోత్సహించడం సరికాదన్నారు. అలాంటి వారికి మంత్రి పదవులు ఇవ్వడం మరీ అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదిని కోరారు.