వైసీపీలో మహిళలకు గౌరవం లేదని ఎంపీ కొత్తపల్లి గీత ఆరోపించారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ తన ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే వైసీపీని వీడినట్లు తెలిపారు. తనకు నియోజకవర్గం... ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకోలేదన్న ఎంపీ గీత ఎన్నికల్లో పోటీకి ముందే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు.
ఇదిలావుంటే కొత్తపల్లి తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు . కొంత కాలంగా అధికార పార్టీ నేతలకు, ఫిరాయింపు ఎంపీ కొత్తపల్లి గీతకు మధ్య నెలకొన్న వివాదాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో తనకు తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధం లేదంటూ గీత సంచలన ప్రకటన చేసారు. అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వం గిరిజన ప్రజా ప్రతినిధులకు అన్యాయం చేస్తోందని కూడా గీత ఆరోపించారు.