తెలంగాణలో కట్టలు పాముల బుసబుసలు

Update: 2018-10-23 09:04 GMT

ఎన్నికల వేళ తెలంగాణలో ధన ప్రవాహం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా డబ్బు పట్టుబడుతోంది. పోలింగ్‌ ఇంకా నెలన్నర ఉండగా..పెద్ద మొత్తంలో నగదు దొరకడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల కోసం కొందరు అభ్యర్థులు ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు చాలా సమయం ఉన్నా..డబ్బు తరలించే పనిలో నిమగ్నమైపోతున్నారు. వరుసగా దొరుకుతున్న డబ్బుల కట్టేలే ఇందుకు నిదర్శనం. ఖమ్మం జిల్లా ఏన్కూర్ లో కోటి రూపాయల నగదు పోలీసులకు పట్టుబడింది. కొందరు వ్యక్తులు ఈ డబ్బును ఓ వాహనంలో తరలిస్తూ దొరికి పోయారు. అయితే దొరికిన డబ్బు ఓ బ్యాంకుకు చెందినదని సంబంధింత వ్యక్తులు చెప్పడంతో.. పోలీసులు విచారణ చేస్తున్నారు. 

హైదరాబాద్ లోనూ పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడింది. మూడు చోట్ల పోలీసులు జరిపిన తనిఖీల్లో 74.82 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. షాఇనాయత్ గంజ్ లో నిర్వహించిన తనిఖీల్లో పవన్ వ్యాస్ అనే వ్యక్తి దగ్గర 60 లక్షలు దొరకగా, జూబ్లీహిల్స్ లో రామచందర్ రావు అనే వ్యక్తి దగ్గర 4.85 లక్షలు, రాజేష్ తివారి అనే వ్యక్తి దగ్గర 9.97 లక్షల నగదును పోలీసు అధికారులు సీజ్ చేశారు. ఇది హవాలా సొమ్మని తెలుస్తోంది. మరోవైపు నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా దగ్గర వాహనాల తనిఖీల్లో మూడు లక్షలకు పైగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు కారులో నగదు తలిస్తుండా పోలీసులు పట్టుకున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా గుడి హథ్నూర్‌ లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో  రెండు లక్షల రుపాయల నగదు దొరికింది. ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. 


 

Similar News