తెలంగాణలో ఎన్నికల వేళ, ప్రధాన పార్టీల అధినేతలు త్యాగాలకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరగుతోంది. అధికార టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి కూటమిగా నాలుగు పార్టీలు జతకట్టాయి. సీట్ల సర్దుబాటుపై అనేక చర్చలు జరుపుతున్నాయి. త్వరలో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ శత్రువు బలంగా ఉన్నప్పుడు సీట్ల సర్డుబాటు విషయంలో త్యాగానికి సిద్దం కావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేతలు సీట్లు త్యాగం చేసి, పొత్తులో ఇతర పార్టీలకు సీట్లు కేటాయిస్తే.. పార్టీలో సీట్లు రాని నేతలు సైతం ఎలాంటి ఆందోళనలు చేయకుండా, తమను ఆదర్శంగా తీసుకుని, కూటమికి నష్టం కాకుండా చూడవచ్చనే వ్యూహంతో అధినేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, తన భార్య పద్మావతి రెడ్డి సీటు త్యాగానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కోదాడ టిక్కెట్టును పొత్తులో భాగంగా టీడీపీ అడుగుతోంది. దీంతో అక్కడ గత ఎన్నికల్లో రెండో స్థానంలో వచ్చిన గొల్లమల్లయ్యయాదవ్‌కు ఇవ్వాలంటోంది. తాను త్యాగం చేయడం ద్వారా పొత్తుల్లో సీట్లు రాని నేతలంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని. ఆదర్శంగా తీసుకుంటారని నేతలు చెప్పుకుంటున్నారు. ఇక టిజేఎస్ అధినేత కోదంరాం సైతం ఇప్పటి వరకు ఎక్కడా నియోజికవర్గం ఎంచుకోలేదు. వరంగల్‌తో పాటు అనేక స్థానాల నుంచి పోటీ చేయాలని, కార్యకర్తలు, జనం కోరుతున్నారని, చాలా సందర్భాల్లో కోదండరాం చెప్పారు. అయితే, ఆయన కేవలం ప్రచారానికే పరిమితం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమిలో అన్ని పార్టీలు ఆయన్ను ఫ్రంట్‌కు, చైర్మెన్ పదవి ఇస్తాం, పోటీ చేయకుండా ప్రచారం చేసి, గెలుపు బాధ్యతలు తీసుకోవాలని కోరుతుంన్నారని చర్చ జరుగుతోంది.
ఇక టీటిడిపి నాయకుడు ఎల్.రమణ సైతం జగిత్యాలను ఆశించారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అది సిట్టింగ్ స్థానం కావడంతో, రమణ కూడా తన సీటు త్యాగం చేసి పార్టీకి ప్రచారం చేస్తానని చెప్పి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరో భాగసామ్య పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, మొన్నటి హుస్నాబాద్ తనదేనని బాహాటంగా చెప్పుకున్నారు. పొత్తుల్లో భాగంగా, హుస్నాబాద్‌పై పట్టుబట్టారు. అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ప్రవీణ్ రెడ్డి ఉండటంతో, చాడను ఒప్పించేందుకు కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేసింది. అందరూ త్యాగానికి సిద్దమవుతుండటంతో చాడ కూడా తన సీటును త్యాగం చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. అందుకు చాడ కూడా మానసికంగా సిద్దమవుతున్నట్టు తెలిసింది.
చివరకు, బీసీ సంఘం జాతీయ నాయకుడు, తాజామాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య సైతం, త్యాగానికి సిద్దమంటున్నట్టు తెలిసింది. ఈసారి పోటికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇంత మంది సీట్లు త్యాగం చేసి, కూటమిలో సీట్ల లొల్లి జరగకుండా సహకరిస్తారని తెలుస్తోంది. వీరి త్యాగాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.