ఈ మధ్య కాలంలో సాహితీవేత్తలకు కాస్త ఆదరణ తగ్గిందని, ఇకపై ఆలాంటి పరిస్థితి ఉండదన్నారు సీఎం కేసీఆర్. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన శతావధానంలో ఆయన పాల్గొన్నారు. జీఎం రామశర్మ శతావధానంలో పృచ్ఛకులుగా కేసీఆర్ వ్యవహరించారు. అలవోకగా పద్యాలు పాడి సాహితీ ప్రియులను అలరించారు. హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు మూడోరోజు సందడిగా సాగుతున్నాయి. తెలంగాణ సారస్వత పరిషత్‌లో అవధాని జీఎం రామశర్మచే నిర్వహించబడిన శతావధానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పృచ్ఛకులుగా వ్యవహరించారు. ఈ మధ్య కాలంలో సాహితీవేత్తలకు కాస్త ఆదరణ తగ్గిందని, ఇకపై ఆలాంటి పరిస్థితి ఉండదన్నారు. సాహితీవేత్తలకు తగిన గుర్తింపు దక్కుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. తాను డాక్టర్ లేదా ఇంజినీర్ కావాలని నాన్న కోరుకునే వారని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే, తన గురువు గారు సాహిత్యం వైపు తీసుకుపోయారన్నారు. ఒకప్పుడు తనకు 3 వేల తెలుగు పద్యాలు కంఠస్తం వచ్చేవని సీఎం గుర్తు చేసుకున్నారు. పలు పద్యాలను కేసీఆర్ అలవోకగా పాడి సాహితీవేత్తలను ఆనందంలో ముంచెత్తారు. తెలుగు సభల ముగింపు రోజున చరిత్రాత్మకమైన నిర్ణయాలు వెల్లడిస్తామని కేసీఆర్ చెప్పారు.