jayalalithas-daughter-claims-claim-be-daughter-supreme-court-rejects-dna-test
తమిళనాడులో వారసత్వ రాజకీయాల చిచ్చు మళ్లీ రాజుకుంటోంది. తాజాగా జయ వారసురాలినంటూ ఓ యువతి సుప్రీం కోర్టుకెక్కడంతో అమ్మ పేరిట ఉన్న ఆస్తులపై మళ్లీ చర్చ జరుగుతోంది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసులమంటూ తెరపైకి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు మొన్నామధ్య జయ లలిత సోదరుడి కుమార్తె అయిన దీపా జయకుమార్ తానే అసలైన వారసురాలినంటూ హడావుడి చేశారు తన అన్న దీపక్ తో విభేదించిన దీప వేదనిలయం ఆస్తిపాస్తులన్నీ తనకే చెందుతాయని జయలలిత బతికున్నప్పుడు తనను ఆదరించిందనీ చెప్పింది చిన్నమ్మ శశికళ ఎంట్రీతోనే తమ సంబంధాలు దెబ్బ తిన్నాయని వాపోయింది. జయకు విశ్వాస పాత్రుడైన పన్నీర్ సెల్వంతో కలసి పనిచేస్తానంటూ ఆర్భాటం చేసిన దీప ఆ తర్వాత పార్టీ పెట్టి ఒంటరి పోరాటానికి దిగి హడావుడి చేసింది. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది.
తాజాగా ఇప్పుడు దీపకు పోటీగా అమృత అనే మరో మహిళ తెరపైకి వచ్చింది. బెంగళూరుకు చెందిన అమృత సారధి జయకు తానే అసలైన వారసురాలినని జయలలిత తన కన్న తల్లేనని అంటోంది. కావాలంటే డిఎన్ఏ టెస్టు చేయాలంటూ ఏకంగా సుప్రీం కోర్టుకే ఎక్కింది అయితే ఈ విషయాన్ని కర్ణాటక హై కోర్టులో తేల్చుకోవాలంటూ సుప్రీం కోర్టు సూచించింది. జయలలిత తన కన్న తల్లి అనీ తాను బెంగళూరులోని జయ లలిత సోదరి శైలజ, ఆమె భర్త దగ్గర పెరిగాననీ చెబుతోంది.
1980 ఆగస్టు14న తాను పుట్టానని జయకు రాజకీయపరమైన ఇబ్బందులు రారాదనే ఉద్దేశంతోనే తన పుట్టుకను బహిరంగ పరచలేదని అమృత చెబుతోంది. అయితే తన తండ్రెవరన్న అంశాన్ని మాత్రం ఆమె చెప్పడం లేదు. తమ కుటుంబం సనాతన సంప్రదాయాలకు విలువనిచ్చే బ్రాహ్మణ కుటుంబం కావడంతో తన పుట్టుకను గోప్యంగా ఉంచారంటోంది. అయితే అమృత వాదనలను సమర్ధిస్తూ ఆమె పినతల్లులు కూడా కోర్టుకొచ్చారు అమతకు డిఎన్ఏ టెస్టు చేయాలని వారు కూడా కోరుతున్నారు. జయ మరణంతో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన వారసత్వ పోరు రోజుకో కొత్త టర్న్ తీసుకుంటోంది అయితే అమృత సారథి ఆరోపణలను దీపా జయకుమార్ గతంలోనే కొట్టి పారేసింది. జయ తోబుట్టువుల మధ్య జరుగుతున్న ఈ రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.