ప్రజాసమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర నిన్న కర్నూల్ జిల్లాలో ముగించుకుని నేడు అనంతపురం జిల్లాలో తొలి అడుగు వేశారు.. ఇవాళ అనంతపురం జిల్లా గుత్తి నియోజకవర్గం అయిన బసినేపల్లి నుంచి కాసేపటి క్రితమే పాదయాత్ర ప్రారంభమయింది.. ఆదివారం పత్తికొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ రాత్రికి కర్నూలు, అనంతపురం జిల్లా సరిహద్దులో బస చేశారు. వైఎస్ జగన్‌కు వైఎస్సార్ సీపీ అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, పార్టీ సమన్వయకర్తలు, అనుబంధసంఘాల నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.. కాగా అనంతలోని 8 నియోజకవర్గాలు.. 250 కి.మీ మేర యాత్ర సాగనుందని వైసీపీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు..