జగన్ ను భవిశ్యత్ లో కలుస్తా.. హీరో సుమంత్..!

Update: 2017-12-12 08:53 GMT

వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి , హీరో సుమంత్ లిద్దరు స్నేహితులన్న విషయం అందరికి తెలిసిందే.. సుమంత్ అప్పుడెప్పుడో తనకు, జగన్ కు మధ్య  ఇంట్లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా అయన నటించిన కొత్త సినిమా విశేషాలు సోషల్ మీడియాలో ముచ్చటిస్తున్న తరుణంలో సదరు యాంకర్ ఇలా అడిగారు.. మీరు రాజేశేఖరరెడ్డి గారి కుమారుడు ప్రతిపక్షనేత  జగన్ స్నేహితులని తెలుసు.. ఇప్పటికి మీ స్నేహం కొనసాగుతుందా అని ఆమె అడిగారు.. దానికి హీరో సుమంత్ సమాధానమిస్తూ తామిద్దరం ఇప్పటికి మంచి స్నేహితులమేనని జగన్ ప్రస్తుతానికి రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్లే తామిద్దరం కలుసుకోవడానికి వీలు పడటం లేదని,  భవిశ్యత్ లో జగన్ ను కలుస్తాను, మాట్లాడుతూనే ఉంటానని సుమంత్ చెప్పుకొచ్చారు..

Similar News