జగన్‌పై కత్తి దాడి వెనుక కథ!!

Update: 2018-10-25 11:04 GMT

వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహ‌న్‌రెడ్డిపై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహ‌న్‌రెడ్డిపై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. ప్రజాసంకల్ప యాత్ర పూర్తి చేసుకొని... హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో ఎదురుచూస్తుండగా దాడి జరిగింది. రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌... కత్తితో జగన్‌‌పై దాడి చేశాడు. సెల్ఫీ నెపంతో వైఎస్‌ జగన్‌ దగ్గరకు వచ్చిన శ్రీనివాస్‌.... కత్తితో మెడపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే జగన్‌ తప్పించుకోవడంతో.... ఆయన భుజానికి తీవ్ర గాయమైంది.

అత్యంత భద్రత ఉండే ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో... వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరగడం తీవ్ర సంచలనం రేపుతోంది. కోళ్ల పందేలకు ఉపయోగించే కత్తితో దాడి చేయడంతో... పక్కా వ్యూహం, ప్లాన్‌తోనే అటాక్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే దుండగుడు శ్రీనివాస్‌... రెండోసారి కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా, అంతలోనే అప్రమత్తమైన జగన్‌ వ్యక్తిగత సహాయ సిబ్బంది, ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ అడ్డుకున్నారు. వెయిటర్‌శ్రీనివాస్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వైఎస్‌ జగన్‌‌పై హత్యాయత్నం జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఉత్తరాంధ్ర నాయకులు, కార్యకర్తలు విశాఖ ఎయిర్‌పోర్ట్‌‌ ముందు ఆందోళన చేపట్టి నిరసన తెలిపారు. అయితే అత్యంత భద్రత ఉండే... అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో... సాక్షాత్తూ రాష్ట్ర ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.
 

Similar News