దద్దరిల్లనున్న ధర్నా చౌక్‌... హైకోర్టు జడ్జిమెంట్‌

Update: 2018-11-14 08:45 GMT

తెలంగాణ పోలీసులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ తరలించాలన్న పోలీసు శాఖ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధర్నాచౌక్ లో యధావిధిగా నిసనలు తెలుపడానికి అనుమతిచ్చింది హైకోర్టు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ లో యదావిధిగా నిరసనలు తెలుపుకోవచ్చంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం ధర్నాచౌక్ ను ఎత్తివేసింది. ధర్నాలతో తమకు ఇబ్బంది ఎదురవుతుందంటూ స్థానికులు ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కావాలంటే నగర శివార్లలో ధర్నాలు చేసుకోవచ్చని తెలిపింది. అయితే అప్పట్లో రాజకీయ పార్టీలు.. ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి.  

ధర్నాచౌక్ లో నిరసనలు తెలపడంపై పోలీసులు నిషేధం విధించారు.దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు హైకోర్టును ఆశ్రయించారు. ధర్నా చౌక్ ను కొనసాగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుపుతూ వచ్చిన హైకోర్టు ధర్నాచౌక్ పునరుద్దరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ప్రజాస్వామ్యంలో నిరసనలు వ్యక్తంచేసే హక్కు ప్రజలకు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది..ఎక్కడో ఊరు బయట ధర్నా చేసుకుంటే ఎవరు వింటారని ప్రశ్నించిన కోర్టు....మనుషులు ఉండని అడవిలో సెల్‌ఫోన్‌ టవర్‌ నిర్మిస్తారా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.ఆరు వారాల వరకు ధర్నా చౌక్‌ను యథావిధిగా కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆరు వారాలు పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తామని తెలిపింది. హైకోర్టు నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిందని ప్రతిపక్ష పార్టీలు.. ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి.

Similar News