పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మొన్న ఆల్ టైం గరిష్ఠానికి చేరిన డీజిల్ ధర..ఇవాళ మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరింది. ఇక పెట్రోల్ ధరలు కూడా నిన్న ఆల్ టైం హయ్యెస్ట్ రేట్‌కు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరల మారథాన్ కొనసాగుతోంది. నిన్న పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భారమయ్యాయి. దేశ రాజధానిలో నిన్న లీటర్ పెట్రోల్ ధర 16 పైసలు పెరిగి.. 78 రూపాయల 84 పైసలకు చేరింది. అలాగే డీజిల్ 34 పైసలు పెరిగి...70 రూపాయల..76 పైసలకు చేరింది. ఇక ముంబయిలో పెట్రోల్ ధర ప్రస్తుతం 86.25గా ఉండగా..డీజిల్ ధర 75.12గా ఉంది. హైదరాబాద్‌లో నిన్న పెట్రోల్ లీటర్‌కు 17 పైసలు పెరిగి...83 రూపాయల 59 పైసలకు చేరింది. లీటరు డీజిల్ 37 పైసలు పెరిగి 76 రూపాయల 97 పైసలకు చేరింది. విజయవాడ, గుంటూరులో పెట్రోల్ లీటరుకు 24 పైసలు పెరిగి... 85 రూపాయల 22 పైసలుగా ఉంది. డీజిల్ 44 పైసలు పెరిగి... 78 రూపాయల 26 పైసలుగా ఉంది.
ఈ ఏడాది మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇప్పుడు పెట్రో ధర రోజు రోజుకు తన రికార్డుల్ని తానే అధిగమిస్తోంది. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ అంశాలను సాకుగా చూపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల, డాలర్‌తో రూపాయి మారకపు విలువ క్షీణిస్తుండటంతో ఇంధన ధరల పెంపు కొనసాగుతుందని మోడీ సర్కార్ చెబుతోంది.