ఐసీయూలో 7 చేపలు

Update: 2018-07-30 06:02 GMT

రాజుగారి ఏడు చేపల కథ మనలో చాలా మందికి తెలుసు కదా ఆ ఏడు చేపలనూ పట్టుకునేందుకు రాకుమారులు ఎన్నో బాధలు పడ్డారని విన్నాం అయితే పట్నా చేపల కథ మీకు తెలుసా ఈ కథలో రాజ్యం, రాజు, రాకుమారులూ లేరు కానీ చేపలు మాత్రం కామన్ గా ఉన్నాయి ఆ కథలో చేపలు పట్టుకునేందుకు రాకుమారులు కష్టపడితే ఈ కథలో కష్టాలతో పాటే చేపలు వచ్చాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పట్నాలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని రోడ్లనే కాకుండా నలంద మెడికల్‌ కాలేజ్ అండ్‌ హాస్పిటల్‌ను కూడా వరద నీరు ముంచెత్తింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న జనరల్‌ వార్డుతో పాటు, ఐసీయూలోకి భారీగా వరద నీరు చేరింది. 

దీంతో పెషేంట్లు బిక్కుబిక్కుమంటూ కాలం  గడుపుతున్నారు. ఐసీయూలోకి వచ్చిన నీటిలో చేపలు కూడా దర్శనం ఇవ్వడంతో వారు షాక్‌కు గరయ్యారు. వరద నీటితో పాటు విష సర్పాలు, ఇతర హానికర కీటకాలు వస్తే తమ పరిస్థితేంటని పెషేంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఐసీయూ లోకి చెప్పులు లేకుండా ప్రత్యేకమైన దుస్తులతో మాత్రమే పేషెంట్ బంధువులను ఎలౌవ్ చేస్తారు. అక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సులు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు సరైన చర్యలు తీసుకోక పోతే పేషెంట్ కి ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.  

ఐసీయూలో విద్యుత్ లేక పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పెషేంట్లకు సేవలు అందించడం కష్టంగా మారిందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు. ఐసీయూ, జనరల్ వార్డ్ లు మొత్తం నీటిలో ములిగి పోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నీళ్లలో తడుస్తూనే నర్సులు, డాక్టర్లు చికిత్సలు చేస్తున్నారు ఇక ఆస్పత్రి పరిసరాలు కూడా పూర్తిగా నీటితో నిండిపోయింది. వెంటనే అధికారులు స్పందించి నీటిని బయటకు పంపివేయాలని రోగుల బంధువులు కోరుకుంటున్నారు. ఆస్పత్రికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో హుటాహుటిన ప్రభుత్వం స్పందించి ఆస్పత్రిని శుభ్రం చేస్తున్నారు.
 

Similar News