ప్రజాసమశ్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర నిర్వహిస్తున్నారు.. అందులో భాగంగానే నేడు గుత్తి శివార్లలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలో ఓ అభిమాని , జగన్ మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది.. స్థానికంగా బాషా అనే టీ కొట్టు వ్యాపారి జగన్ వద్దకు వచ్చి టీ తాగమని అడిగారు.. దానికి జగన్, "అన్నా నేను ఇప్పుడే భోజనం చేశాను టీ తాగలేను" అని సమాధానమిచ్చారు.. దీంతో సంతృప్తి చెందని బాషా టీ తాగితేనే మీరు సీఎం అవుతారని చమత్కరించారు.. ఇక జగన్ మాత్రం ఏమి చేస్తారు బాషా ఇచ్చిన టీ తాగి అక్కడినుంచి బయలుదేరారు.. కాగా తొలుత గుత్తి సమీపంలో ఉల్లి రైతులతో మాట్లాడిన వైఎస్ జగన్, అనంతరం వేరుశెనగ రైతులతో పంటలు, దిగుబడి, గిట్టుబాటు ధరల గురించి చర్చించారు.