వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తన వ్యూహాలకు పదను పెడుతున్నారు గులాబీ బాస్ అందులో బాగంగా ఉత్తర తెలంగాణ లో కేటిఆర్ ,దక్షణ తెలంగాణ హరిష్ రావు పార్టీ బలోపేతం కోసం ఈ ఇద్దరు మంత్రులకు భాద్యతలు అప్పగించారు ముఖ్యంత్రి కేసిఆర్ దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు వరుస పర్యటనలతో క్యాడర్ ను ఉత్తాహా పరుస్తు గులాబీ నేతల్లో జోష్ నింపుతున్నారు.
టార్గెట్ 2019 అంటోంది టిఆరెస్ ఈసారి ఎన్నికల్లో మునుపటికంటే మెరుగైన ఫలితాలు సాధించాలనుకుంటున్న టిఆరెస్ అందుకు యాక్షన్ ప్లాన్ కూడా మొదలు పెట్టేసింది. గత ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించి సక్సెస్ అయిన గులాబీ దళం వచ్చే ఎన్నికల్లో ఆ పట్టును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక దక్షిణ తెలంగాణలో గతంలోనే మెరుగైన ఫలితాలు సాధించిన టిఆర్ఎస్ ఈసారి మాత్రం క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యం పెట్టుకుంది. అందుకోసం పార్టీ బలోపేతంతో పాటు గెలుపు భాద్యతలను పార్టీ అధినేత కెసీఆర్ కీలక నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది.
టిఆరెస్ పార్టీ బలోపెతానికి మొదట్నుంచి కష్టపడిన హరీష్ రావు, కేటిఆర్ ఇద్దరికీ ఈ బాధ్యతలను కేసిఆర్ అప్పగించారు. పార్టీని అనునిత్యం ప్రజల మధ్య నిలిపేందుకు వీరిద్దరూ ప్రతీరోజూ ఏదో ఓ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిత్యం జనం మధ్యే ఉంటూ కేడర్ ను ఉత్సాహపరుస్తున్నారు. లోటుపాట్లను సరిదిద్దుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడటంలో అటు హరీష్ రావు, ఇటు కేటిఆర్ ఇద్దరూ ఇద్దరే..ఇటీవల ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించిన మంత్రి కెటీఆర్ నిత్యం ఏదో ఒక జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతూనే మరో వైపు బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాదు కాంగ్రెస్ పార్టీని నేరుగా టార్గెట్ చేస్తూ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.
అధికారాలు, విధుల విషయంలో ఇద్దరికీ కేసిఆర్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణ బాధ్యతలు కేటిఆర్ కు దక్షిణ తెలంగాణ బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. వారి పర్యటనలు చూస్తే అది నిజమే అన్న భావన కలుగుతోంది. ఉత్తర తెలంగాణలో జరిగే ప్రతి కార్యక్రమానికి కెటిఆర్ ముఖ్య అతిధిగా హజరవుతున్నారు. గ్రేటర్ హైదరాబాదు కూడా కేటీఆర్ కే అప్పగించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 99మంది కార్పొరేటర్లను గెలిపించుకోవటం లో కేటీఆర్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఇక దక్షిణ తెలంగాణలో అంతా తానై, అన్నీ తానై హరీష్ రావు చూసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యవేక్షణ మాత్రమే చేస్తోన్న హరీష్ దక్షిణ తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో మెరుగైన ఫలితాలు వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో టిఆర్ఎస్ గెలవలేకపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనేది కేసిఆర్ ఆలోచన. అందులో భాగంగానే దక్షిణ తెలంగాణలో వివిధ పార్టీల నేతలను కారెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి పలువురు నేతలకు గులాబీ కండువాలు కప్పారు. ఇప్పుడిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాలపై దృష్టి పెడుతోంది టిఆరెస్. ఇటీవల మంత్రి హరీష్ కొడంగల్ పర్యటన చూస్తే టిఆరెస్ ఎంత పట్టుదలతో ఫోకస్ పెట్టిందో అర్థం అవుతోంది.
జిల్లాల్లో పార్టీ స్థితిగతులు, ఎమ్మెల్యే పనితీరును ఎప్పటికప్పుడు హరీష్, కేటిఆర్ లు తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తూ స్థానిక పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఏ సీటుకు ఎవరు పోటీ అన్నది నిర్ణయించేది కేసిఆరే కాబట్టి అభ్యర్ధుల పేర్లు చెప్పకుండా బహిరంఘ సభల్లో అభివృద్ధిని మాత్రమే ప్రస్తావిస్తున్నారు. కేడర్లో ఉత్సాహం నింపుతున్నారు. మొత్తానికి అటు కెటీఆర్ ఇటు హరీష్ రావు జిల్లా పర్యటనలతో టిఆరెస్ కేడర్ బీజీగా మారింది. వీరి పర్యటనలతో జిల్లాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.