డ్వేన్‌ బ్రావో షాకింగ్‌ నిర్ణయం

Update: 2018-10-25 07:32 GMT

వెస్టిండిస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బ్రావో మీడియా ప్రకటన ద్వారా వెల్లడించారు. ‘14 ఏళ్ల క్రితం వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాను. నాకు ఇప్పటికీ ఆ క్షణాలు గుర్తున్నాయి. 2004లో ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్ ఆడటానికి లార్డ్స్‌లోకి అడుగుపెట్టే ముందు మెరూన్ క్యాప్ అందుకున్నాను. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాను. తర్వాతి తరం క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం కోసం రిటైర్ అవుతున్నా’ అని బ్రేవో తన ప‍్రకటనలో స్పష్టం చేశాడు. అయితే క్రికెటర్‌గా ప్రొఫెషనల్‌ కెరీర్‌ను కొనసాగిస్తానని బ్రేవో తెలిపాడు. దాంతో ఐపీఎల్‌ వంటి లీగ్‌ల్లో ఆడతానని బ్రేవో చెప్పకనే చెప్పేశాడు.

డ్వాన్ బ్రావో క్రికెట్ కెరీర్

 

బ్యాటింగ్ కెరీర్:

టెస్ట్ మ్యాచ్‌లు-40, పరుగులు-2200, సెంచరీలు-3

వన్డే మ్యాచ్‌లు-164, పరుగులు-2968, సెంచరీలు-2

టీ20 మ్యాచ్‌లు- 66, పరుగులు-1142, హాఫ్ సెంచరీలు-4

ఐపీఎల్ మ్యాచ్‌లు- 122, పరుగులు-1403, హాఫ్ సెంచరీలు-5

 

బౌలింగ్ కెరీర్:

టెస్ట్ మ్యాచ్‌ వికెట్లు- 86

వన్డే మ్యాచ్ వికెట్లు- 199

టీ20 బౌలింగ్- 52వికెట్లు

ఐపీఎల్ కెరీర్- 136 వికెట్లు

Similar News