దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన ఆర్కేనగర్ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పోటీ పడుతున్నారు.. ఎ పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేని అయన ఇండిపెండెంట్ అభ్యర్ధ్హిగా పోటీకి దిగుతున్నారు .. దీంతో అయన వ్యతిరేకవర్గం మూకుమ్మడి దాడికి దిగుతుంది.. ఆర్కేనగర్ లో పోటీకి దిగుతున్న విశాల్ తమిళ నిర్మాతల మండలి పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పాల్గొనాలని నటుడు, దర్శకుడు చేరన్ తమిళ నిర్మాతల మండలికి లేఖ రాశారు..
హీరో, దర్శకుడు చేరన్ విశాల్ తమిళ నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ ట్విట్టర్‌లో గొంతు విప్పారు. విశాల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు. దీనిపై ఆయన సోమవారం నిర్మాతల మండలికి లేఖను రాశారు. అందులో మొట్టమొదటి సారి పోటీలోనే నకిలీ ముఖంతో ఎవరి ప్రేరేపణతోనో విశాల్ వ్యాపార గర్రంగా మారారని ఆరోపించారు. దర్శకుడు చేరన్ మండిపడ్డారు..