దుమారం : ఎంపీ తలపై తుపాకీ ఎక్కుపెట్టిన కానిస్టేబుల్

Update: 2017-12-17 13:43 GMT

ఓ ఎంపీ తలపై కానిస్టేబుల్ తుపాకి ఎక్కుపెట్టడంపై దుమారం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ కమల్ నాథ్ పై  చింద్వారా విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైదంది. ఓ కానిస్టేబుల్ ఆయనపై తుపాకీ ఎక్కుపెట్టడంతో కంగుతిన్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఆ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.  ఇదిలా ఉంటే  కమల్‌నాథ్‌పై ఓ కానిస్టేబుల్ తుపాకీ ఎక్కుపెట్టిన విషయాన్ని మధ్యప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్, రాజ్యసభ సభ్యుడు వివేక్ తాంఖా ట్విటర్‌లో పోస్ట్ చేశారు.  'కమల్‌నాథ్‌పై చింద్వారా విమానాశ్రయంలో ఓ కానిస్టేబుల్ లోడెడ్ రైఫిల్ ఎక్కుపెట్టారు. ఇది విద్వేష రాజకీయమా? తీవ్ర స్థాయిలో ఖండిద్దామా?' అని తంఖా ఆ ట్వీట్‌లో పేర్కొనడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Similar News