ఒక తాటిపైకి కాంగ్రెస్, టీడీపీ...మారుతున్న రాజకీయ సమీకరణలు

Update: 2018-07-26 08:38 GMT

రాజకీయంగా బద్ధశత్రువులైన కాంగ్రెస్‌, టీడీపీలు రాబోయే ఎన్నికల్లో జట్టు కడతాయా? ఇందుకు ఇరు పార్టీలు సిద్ధమేనా...? ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అదిశగానే చకచక పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఇందుకు రాష్ర్ట నేతలు ఏ విధంగా స్పందిస్తారో అన్నది రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  

ఎన్నికలు సమీపిస్తుంటే పొత్తులపై రోజు రోజుకు ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఎవరూ ఊహించనని విధంగా కాంగ్రెస్, టీడీపీ ఒక తాటిపైకి వచ్చే విధంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇప్పటికే ఏపీలో అధికార పార్టీ టీడీపీ కాంగ్రెస్ తో భవిష్యత్తులో పొత్తుకు ఆసక్తి చూపుతుండటంతో తెలంగాణాలోనూ పొత్తు తప్పకపోవచ్చని హస్తం పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.  సీడబ్ల్యూసీ సమావేశంలో రాజకీయపార్టీలతో పొత్తుల అంశాన్ని స్వయంగా రాహుల్ గాంధీ ప్రస్తావించారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్ లో అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన తీరు భవిష్యత్తులో టీడీపీతో పొత్తు తప్పకపోవచ్చని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది.

దేశంలో రాజకీయాలు రెండు గ్రూపులుగా చీలిపోతున్నాయన్న సంకేతాలు బలంగా ఉన్నాయని అధికారం చేజిక్కించుకోవాలంటే ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలని రాష్ర్ట నేతలకు సంకేతాలు జారీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. టీడీపీతొ పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో ఉన్న సెటిలర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతారని భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం పొత్తలపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు.  ఎన్నికల నాటికి అధిష్టానం కమిటీ ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు సాధ్యమయ్యేనా ఒంటిరిగా వెళ్తుందా అనేది  మరికొద్ది రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Similar News