కాంగ్రెస్‌లో కమిటీల చిచ్చు... అంతా హస్తవ్యస్థం

Update: 2018-09-22 05:59 GMT

ముందస్తు ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి దుమారం రేపుతోంది. పార్టీ టిక్కెట్ల ప్రకటనకు ముందే అసమ్మతి పార్టీని కలవరపెడుతోంది. అనుబంధ సంఘాల ప్రకటించడంతో ప్రాధాన్యం దక్కని సీనియోర్లు బహిరంగంగా పార్టీపై విమర్శలు చేశారు. లైన్ దాటి వివాదాస్పదంగా మాట్లాడుతున్న వారిని హెచ్చరిస్తూనే షోకాజ్ నోటీసులు జారీచేస్తోంది క్రమశిక్షణ సంఘం. 

కాంగ్రెస్ కమిటీల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూశారు. కమిటీలు వెలువడిన... అసంతృప్తి జ్వాలలు మాత్రం ఇంకా కొనసగుతూనే ఉన్నాయి. కమిటిలన్నీ గందరగోళంగా చిందరవందరగా ఉన్నాయని కాంగ్రెస్‌లో కొందరు సీనియర్లు అంటున్నారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత ఆజాద్ వద్ద కూడా కొంతమంది అసంతృప్తి వెళ్లగక్కారు. తనకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి వస్తుందని పీసీసీ ముఖ్యనేత తనకు హామినిచ్చారని పదేపదే చెప్పుకున్నారు వీహెచ్. ఇప్పటికే వీహెచ్ ఏకంగా ఓ ప్రచార రథాన్నే తయారుచేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రచార రథం ఏం చేసుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారాయన. కొంతమంది కావాలనే మిస్ గైడ్ చేసి తనకు పదవి రాకుండా అడ్డుకున్నారని... పార్టీలో కొందరు కోవర్టులున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పీసీసీపై డైరెక్ట్‌గానే ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ఇన్‌ఛార్జిగా ఉన్న  కుంతియా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి శనిగా మారాడని, వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వారికి టీపీసీసీ కమిటీలో ప్రాధాన్యం కల్పించారని విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీకి అవసరమో కాదో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణహించుకోవలని రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. నిన్న మొన్న పార్టీలో చేరిన వాళ్లకు కీలక పదవులు ఎలా ఇస్తారని పొంగులేటి అభ్యంతరం చెబుతున్నారు. ఇటు మహిళలకు కూడా సరైన ప్రాధాన్యం దక్కలేదంటున్నారు మహిళానేతలు. 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, కమిటీల్లో నలుగురైదుగురికి కూడా చోటు కల్పించలేదని అసంతృప్తిగా ఉన్నారు. మొత్తానికి కమిటీలు వేస్తే కొందరు నేతలకు పార్టీ పదవులు వస్తాయని భావించింది పీసీసీ.  ప్రస్తుతం వివాదం షోకాజ్ నోటీసుల దాకా వెళ్ళింది.  మరి ఈ వివాదం ఎలా సద్దుమనుగుతుందో చూడాలి.

Similar News