కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే, ఫ్రాన్స్ కంపెనీ దసోతో డీల్‌ను సెట్ అయ్యింది. కానీ హాల్ ఆఫ్‌సెట్ పార్ట్‌నర్. అయితే ఇప్పుడు మాత్రం ఆ పార్ట్‌నర్ అనిల్ అంబానీ కంపెనీ. అదే విషయమే కాంగ్రెస్ మదిలో అనుమానాల విత్తనాలు నాటింది. పూట పూటకూ రేటు పెరగడం బీపీ పెంచుతోందని కాంగ్రెస్ కారాలు మిరియాలు నూరుతోంది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ కొన్ని ప్రశ్నలు సందిస్తోంది. వాటికి సమాధానమివ్వండి చాలు అని డిమాండ్ చేస్తోంది. ఇంతకీ కాంగ్రెస్ క్వశ్చన్స్ ఏంటి? కాంగ్రెస్ మొదటి ప్రశ్నకాగ్ నివేదికపై సుప్రీంకు అబద్దం చెప్పడమేంటి?రాఫెల్ ఒప్పందంలో అసలు ఎలాంటి అనుమానాలకు తావులేదని, కాగ్ నివేదిక ఆధారంగా తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. వాస్తవానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్...కాగ్ అలాంటి రిపోర్ట్ ఏదీ ఇవ్వలేదు. పార్లమెంటు ముందుకానీ, పీఏసీకి కానీ అలాంటి నివేదిక చూపలేదు. సుప్రీంకోర్టునే ఇలా మోసం చేస్తారా? అని బీజేపీని ప్రశ్నించింది కాంగ్రెస్. రిలయన్స్, దసో మధ్య 2012లోనే ఒప్పందం కుదిరిందని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. కానీ... రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ పుట్టిందే 2015 మార్చి 28వ తేదీన. ఏంటీ ఈ మతలబు అని అడుగుతోంది కాంగ్రెస్. కాంగ్రెస్ మూడో ప్రశ్నహోలాండ్ ప్రకటనపై సుప్రీంను తప్పదారిపట్టిస్తారా?
మోడీ సూచన మేరకే ఆఫ్‌సెట్ భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ ఎంపిక చేసినట్లు చెప్పిన, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ తర్వాత మాట మార్చారని సుప్రీం కోర్టు తన తీర్పులో వెల్లడించింది. కానీ... తన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని హోలాండ్ స్పష్టం చేశారు. ఆ ప్రకటనను తాను ఖండించలేనని ప్రస్తుత అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ కూడా ప్రకటించారు కదా అంటున్నారు రాహుల్ గాంధీ. హోలాండ్ ప్రకటన చేయకపోయినా, ప్రకటించినట్టు సుప్రీంకు ఎందుకు తప్పుడు సమాచారమిచ్చారన్నది రాహుల్ క్వశ్చన్.
కాంగ్రెస్ నాలుగో ప్రశ్నహాల్, దసో డీల్‌ను ఎందుకు దాచారు?
రాఫెల్ డీల్‌తో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ హాల్‌కు సంబంధమే లేదని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ... హాల్, దసో మధ్య 2014 మార్చిలోనే అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందంపై న్యాయ శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు ముందు ఎందుకు దాచిపెట్టారన్నది కాంగ్రెస్ ప్రశ్న.కాంగ్రెస్ ఐదో ప్రశ్నకొనుగోళ్లపై నిబంధనలు పాటించరా? 36 రాఫెల్ విమానాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన తర్వాతే, దీనిని రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల మండలి ఆమోదముద్ర వేసింది. మరి ఇది... నిబంధనలకు విరుద్ధం కాదా? అంటోంది కాంగ్రెస్.కాంగ్రెస్ ఆరో ప్రశ్న126కి బదులు36 మాత్రమే కొనడమేంటి? : మొదట 126 యుద్ధ విమానాలు కొనాలని నిర్ణయించారు. వాటికి బదులు కేవలం 36 మాత్రమే ఎందుకు కొనాలని డిసైడయ్యారు. ఇది దేశ భద్రత విషయంలో రాజీపడటం కాదా....అంటోంది కాంగ్రెస్.
కాంగ్రెస్ ఏడో ప్రశ్నవిమానాల ధరలనుసడన్‌గా ఎందుకు పెంచారు?: ఒక్కో రాఫెల్ విమానం ధర మొదట రూ.526 కోట్లు. కానీ ఆమాంతం రూ.1670 కోట్లకు ఎందుకు పెంచారన్నది కాంగ్రెస్ మరో ప్రశ్న. పెంచిన వ్యయం కేవలం అనిల్ అంబానీకి లబ్ది చేకూర్చేందుకేనన్నది కాంగ్రెస్ ఆరోపణ. అయితే ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అసలు ప్రారంభం కాని, కేవలం పేపర్ మీదే ఉన్న అనిల్ అంబానీ డిఫెన్స్ కంపెనీకి, ఎందుకు డీల్ ఇచ్చారన్నది అన్నివైపుల నుంచి దూసుకొస్తున్న ప్రశ్న. దశాబ్దాలుగా భారత రక్షణ రంగానికి, అనేక విమానాలు సమకూర్చిన అనుభవమున్న హాల్‌ను కాదని, అసలు పురుడే పోసుకుని అంబానీ కంపెనికి ఎందుకు కట్టబెట్టారన్నది అసలు ప్రశ్న. ఇవన్నీ తేలాలంటే జేపీసీ వేయాలన్నది ప్రతిపక్షాల డిమాండ్. కానీ ఈ ప్రశ్నలన్నింటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న ఒకే ఒక్క సమాధానం దేశ భద్రత దృష్ట్యా ఒప్పంద వివరాలేవీ బహిర్గతం చేయలేమని దేశ భద్రత కాంగ్రెస్‌కు అక్కర్లేదా అని ఎదురు ప్రశ్నసుప్రీం కోర్టు తీర్పునే ధిక్కరిస్తారా అని మరో సూటి ప్రశ్న. ప్రధాని మోడీ ఈ ప్రశ్నలకు సమాధానమివ్వరు అటు ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించకుండా రాజీపడవు...వివరాలు బయటకు రావు. అందుకే పార్లమెంట్‌లోపలా, బయటా రాఫెల్ రగడ...యుద్ధయంత్రాలను, రాజకీయ తంత్రాలుగా మలిచి, 2019 ఎన్నికల్లో అస్త్రంగా ప్రయోగించిండమే అధికార, విపక్షాల సిసలైన శస్త్రం.