వైసీపీకి రాజీనామా చేసిన చిత్తూరు లీడర్..

Update: 2017-12-12 08:16 GMT

మూడున్నరేళ్ళనుంచి టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే లు జంప్ అవుతూనే వున్నారు.. మొన్నటికి మొన్న విశాఖ జిల్లా వైసీపీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి ఆ పార్టీకి షాక్ ఇచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్ధం పుచ్చుకున్నారు.. అయితే ఆమె పార్టీ ఎందుకు మారాల్సివచ్చిందో అధినేత జగన్ కు రాష్ట్ర ప్రజలకు తెలిసిందే.. అయితే తాజాగా చిత్తూరు జిల్లా నుంచి ఆ పార్టీకి చెందిన కీలకనేత ఝలక్ ఇచ్చారు.. గతంలో  జిల్లా పరిషత్ మాజీ ఛైర్మెన్  గా పనిచేసిన సుబ్రహ్మణ్యం రెడ్డి 2012 లో వైసీపీలో చేరారు.. అప్పటినుంచి జిల్లాలో వైసీపీకి ఒక పెద్దదిక్కుగా వుంటూ వస్తున్న అయన ఇవాళ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది..

Similar News