ఎన్నికలు దగ్గపడుతున్న కొద్దీ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది తెలంగాణ బీజేపీ. ఇప్పటికే 66 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ, చివరి లిస్టు ప్రకటించే ముందు పొత్తులకు అవకాశమిస్తుందిని ఎవ్వరూ ఊహించలేదు. కానీ సొంతపార్టీ నేతలకు సైతం, ఊహకందని విధంగా కొత్త పార్టీతో పొత్తులు పెట్టుకుంటున్నట్లు ప్రకటించింది. మొన్ననే పురుడు పోసుకున్న యువ తెలంగాణ పార్టీతో జట్టుకట్టాలని నిర్ణయించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత చిన్న పార్టీతో, దేశంలో అధికారంలో ఉన్న పార్టీ పొట్టుపెట్టుకోవడం, రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. యువ తెలంగాణ పార్టీ నేతలంతా, బీజేపీలో చేరతారని ఈమధ్య ప్రచారం జరిగింది. చివరకు ఆ పార్టీతో అడుగులేయాలని డిసైడయ్యింది. తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోతామని, బీజేపీ నేతలంటున్నారు.
యువ తెలంగాణ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ, అనేక వ్యూహాలకు కూడా స్కెచ్ వేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో టిక్కెట్టు రాని ఓ ముఖ్యనేతను, బిజేపిలో చేర్చుకోవాలని ప్రయత్నం చేసినా..ఆయన నేరుగా పార్టీలోకి రావడానికి నిరాకరించడంతో యువ తెలంగాణ పార్టీతో పొత్తుల పెట్టున్నట్లు చర్చ జరుగుతోంది. నేరుగా బిజేపిలో చేరడానికి నిరాకంచే నేతలకు బిజేపి మరో వేదికను ఏర్పాటు చేయడానికే, యువతెలంగాణ పార్టీతో పొత్తులు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో టిక్కెట్ ప్రకటన రాగానే అక్కడ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నేతలంతా, యుతెలంగాణ పార్టీ వేదికకు చేరుకొని, బిజేపితో పొత్తులో కలిసి పోటిచేయడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలో నిరాశతో ఉన్న నేతలను, యువత తెలంగాణ ద్వారా తీసుకురావడానికి బిజేపి కార్యవర్గ సభ్యుడు ప్రదీప్ కుమార్ మంత్రాంగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రదీప్ కుమార్ చాలా మంది కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతలను యువతెలంగాణ పార్టీ వేదికకు తీసుకువచ్చి పోటి చేయించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాము ఇద్దరమే కాదు, మహా శక్తిలా ఎదిగి బిజేపిని అధికారంలోకి తీసుకువస్తామని చెబుతున్నారు యువ తెలంగాణ నేతలు. రాష్ట్రంలో అతి చిన్న పార్టీతో పొత్తు పెట్టుకున్న జాతీయపార్టీ వ్యూహం, ఏమిటో సొంతపార్టీ నేతలకు రుచించిడం లేదు. కొత్త వేదిక వైపు ఎంతమంది వస్తున్నారో చూడాలి.