ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం దేశరాజధానిలో సంచలనం సృష్టించింది. క్షుద్ర పూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంతా భావిస్తున్నారు. అయితే ఈ కేసులో బంధువుల మాత్రం కొత్త వాదనను వినిపిస్తున్నారు. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వారికి లేదని, ఖచ్ఛితంగా ఎవరో వారిని చంపి వేలాడదీసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇంతకీ ఢిల్లీలో ఏం జరిగింది?
ఢిల్లీలోని బురారీ ప్రాంతలో 11 మంది అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలో పోస్ట్ మార్టం నివేదిక అనేక విషయాలను స్పష్టం చేస్తోంది. ఈ నివేదిక ప్రకారం చనిపోయిన వారిలో ఆరుగురు ఉరి వేసుకోవడం వల్లే మరణించారని వెల్లడైంది. ఈ పదకొండు మందిలో పది మంది పైకప్పుకు వేలాడుతూ కనిపించగా, వృద్ధురాలి మృతదేహం నేలపై పడి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మరణాలు ఎలా సంభవించాయనే అంశంపై పోలీసులు ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు. అందరూ సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేదంటే ఎవరైనా అందరినీ చంపేసి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
బురారీ సామూహిక హత్యల పోస్ట్ మార్టం నివేదికను మృతుల బంధువులు తప్పుబడుతున్నారు.‘వాళ్లంతా బాగా చదువుకున్న వాళ్లని, వారు దెయ్యాలు-చేతబడులను నమ్మటం ఏంటని బంధువులు ప్రశ్నిస్తున్నారు. వాళ్లకు ఎలాంటి ఆర్థిక కష్టాలు లేవు. అప్పులుగానీ, లోనులు గానీ లేవు. అన్నీ బాగున్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏంటి? నోటికి ప్లాస్టర్లు, చేతులు కట్టేసి ఎలా సూసైడ్‌కు పాల్పడతారు? వాళ్లకు శత్రువులంటూ ఎవరూ లేరు. కానీ, ఖచ్ఛితంగా ఎవరో చంపే ఉంటారని మాకు అనిపిస్తోంది అని సుజాత అనే బంధువు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భాటియా కుటుంబ సభ్యులు చనిపోయిన ఆ ఇంటి గోడకు 11 పైపులు ఉండడం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. 11 మంది చనిపోవడం 11 పైపులు ఉండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ కేసులో చేతి రాతలతో దొరికిన ఓ నోట్ పోలీసులకు కీలక ఆధారంగా మారింది. ఈ డెత్ డైరీ బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని, అందులో రాసిపెట్టినట్లుగానే వాళ్లు ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
అసలు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముంది?
ఉరివేసుకుని ఆతహత్య చేసుకున్నారని అటాప్సీ రిపోర్ట్ చెబుతోంది. ఉరివేసుకున్నప్పుడు ఎలాంటి స్ట్రగుల్ అంటే పెనుగులాట జరగలేదని పోస్ట్‌మార్టం నివేదిక సారాంశం. అయితే ఇదంతా నిజమా కాదా అన్న ప్రశ్నలైతే చాలా రైజ్ అవుతున్నాయి? ఆ ప్రశ్నలేంటో తెలుసుకునేముందు, అసలు ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందో, పోలీసుల రిపోర్ట్ ఏంటో ఒక్కసారి చూద్దాం....
జూన్ 17
నారాయణి మనవరాలి నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు.
జూన్ 30
8pm:భవనేష్ తన ప్లైవుడ్ షాప్‌ను క్లోజ్ చేసి ఇంటికి బయల్దేరారు.
10pm:మరో కుమారుడు తన కిరాణా దుకాణాన్ని మూసివేసి, ఇంటికి వచ్చేశాడు.
11pm: నారాయణ చిన్న కుమారుడు లలిత్ తన సోదరి సుజాతకు ఫోన్ చేశాడు. తన యోగక్షేమాలు వాకబు చేశాడు.
జులై 1
7.15am: రెండు షాపులు క్లోజ్ చేశారని తెలుసుకుని పొరుగింటి గురుచరణ్ సింగ్, వారింటికి వెళ్లాడు. ఉరివేసుకోవడం చూసి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు.
7.30am: సమాచారం తెలుసుకున్న ఇన్స్‌స్పెక్టర్ ఎంపీ భరద్వాజ్, మనోజ్ కుమార్, ఏసీపీ కేసీ, తమ బృందాలతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
1pm: పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి మృతదేహాలు తరలించారు. తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు.
ఇదంతా పోలీసులకు తెలిసింది...మనకు తెలిసింది...కానీ సమాధానం రావాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి? ఇంతకీ ఏంటా ప్రశ్నలు...
క్వశ్చన్ నెం 1
ఒక రూంలో వృద్దురాల్ని గొంతుకోసి చంపేశారు. అందరూ ఆత్మహత్య చేసుకున్నారంటే, ఈమె ఒక్కతినే ఎందుకు చంపేశారు?
క్వశ్చన్ నెం 2
కుటుంబ సభ్యులు మొదట ఆమెను చంపేసి, తర్వాత సూసైడ్ చేసుకున్నారా?
క్వశ్చన్ నెం 3
ఇంటి మెయిన్ డోరు ఎందుకు ఓపెన్‌గా ఉంది?
హంతకులు ఈ తలుపుగుండా పారిపోయారా?
క్వశ్చన్ నెం 4
ఒకవేళ బయటివ్యక్తే ఇంట్లోకి వచ్చి ఉంటే, చుట్టుపక్కలవాళ్లుఎవరూ కుక్క అరుపులు ఎందుకు వినలేదు?
క్వశ్చన్ నెం 5
ఇది సామూహిక ఆత్మహత్యే అయితే, సూసైడ్ నోట్ ఎందుకు రాయలేదు?
క్వశ్చన్ నెం 6
ఫ్యామిలీలో ఎలాంటి గొడవలూ లేవని బంధువులు చెబుతున్నారు.
మరి నిజంగా ఆత్మహత్యే అయితే కారణాలు ఏవై ఉండొచ్చు?
క్వశ్చన్ నెం 7
అందరూ ఆధ్యాత్మిక సందేశాలతో కూడిన చున్నీలను మెడకు చుట్టుకుని చనిపోయారు. ఎందుకు?
క్వశ్చన్ నెం 8
ఒకవేళ ఇంట్లో దొంగతనమే జరిగి ఉంటే, ఇంట్లో ఉన్న డబ్బులను దొంగ ఎందుకు తీసుకెళ్లలేదని పోలీసుల ప్రశ్న.
క్వశ్చన్ నెం 9
ఒకవేళ నిజంగా సూసైడ్ అయితే, కాళ్లూ చేతులను ఎందుకు కట్టేసుకున్నట్టు?
క్వశ్చన్ నెం 10
పిల్లలు కూడా ఉరివేసుకున్నారు.
ఎలాంటి శబ్దమూ చేయకుండా పిల్లలు తమను తాము ఆత్మహత్య చేసుకోవడానికి ఒప్పుకున్నారా?
క్వశ్చన్ నెం 11
ఆత్మహత్య చేసుకున్న పిల్లల పాదాలు నేలకు తాకుతున్నాయి.
అంటే వారిని చంపి, బాడీలను వేలాడదీశారా?
క్వశ్చన్ నెం 12
వారి ముఖాలను కవర్లతో ఎందుకు కప్పేశారు.
క్వశ్చన్ నెం 13
కుటుంబ సభ్యులంతా విషం పుచ్చుకున్నారా?
ఈ మతానికో, ఆ మతానికో పరిమితం కాలేదు...మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు. అన్నింట్లోనూ రకరకాల అభిప్రాయాలు రాజ్యమేలుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ప్రభు పిలుస్తున్నాడని కొందరు ఆత్మహత్య చేసుకుంటే, కొన్ని రిలీజియన్లలో దేవుని పేరుతో జనాలను దారుణంగా చంపేస్తున్నారు. పవిత్రస్థలాల్లో చనిపోతే, వైకుంఠానికే వెళతామన్న భావనతో, తిరుమలలో ఒక కుటుంబం సూసైడ్ చేసుకుంది. మరి మతం పేరుతో, దేవుడి పేరుతో చంపడాలు, చంపుకోవడాలు ఇంకెన్నాళ్లూ ఓ పిల్లాడు చెప్పినట్టు, దేవుడిని రకరకాలుగా ఊహించుకోవడమే మతం. ప్రాణం అన్నింటికన్నా ముఖ్యమైనది, తిరిగిరానిది. మతం పేరుతో చనిపోవడం, చంపడం కేవలం మనిషి అజ్ణానం, అంధవిశ్వాసం.