ఆ రోజుల్లో మరి నాన్నగారూ.... ఈ రోజుల్లో మరి అబ్బాయ్ గారు!!

Update: 2018-10-03 06:05 GMT

ఆయన తొడగొడితే బాక్సాఫీసు బద్దలు. మీసం మెలేస్తే ఉర్రూతలు. పంచ్‌ డైలాగ్‌ వేస్తే ఈలలే ఈలలు. సినిమా స్క్రీన్‌ అయినా, ఎలక్షన్‌ క్యాంపెన్‌ అయినా, ఆయన మాటే యం ఘాటుసెపరేటు. ఆయన రూటే సెపరేటు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణ ఎన్నికల రణక్షేత్రంలోనూ చెలరేగిపోయేందుకు ఆ కథనాయకుడు సిద్దమంటున్నారు. ఇప్పటికే ఖమ్మంలో క్యాంపెన్‌కు శ్రీకారం చుట్టారు.

నందమూరి బాలకృష్ణ. ఈ పేరింటే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆయన డైలాగ్‌ పేల్చాడంటే, సిల్వర్‌ స్క్రీనే కాదు, ఎలక్షన్‌ క్యాంపెన్‌ అయినా షేక్‌ అవ్వాల్సిందే. బాలయ్యలోని ఈ క్రేేజ్‌ను తెలంగాణలో ఫుల్‌గా వాడుకోవాలని డిసైడయ్యింది తెలుగుదేశం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బాలయ్యతో ప్రచారాన్ని హోరెత్తించాలని ప్లాన్‌ చేస్తోంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమాతో బిజిబిజీగా ఉన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, చాలారోజుల తెలంగాణలో  పర్యటించారు. ఖమ్మం జిల్లాలో బాలయ్యకు టీడీపీ నేతలు  ఘనస్వాగతం పలికారు. రాయపట్నం నుంచి మథిర వరకు నిర్వహించిన బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. 

తర్వాత, అంబేద్కర్‌, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పర్యటనలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలను బాలకృష్ణ ఆవిష్కరించారు. సత్తుపల్లి బహిరంగ సభలో పాల్గొన్న బాలకృష్ణ...తెలంగాణలో టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్టీఆర్, చంద్రబాబు ఎనలేని కృషి చేశారని చెప్పారు. అసెంబ్లీపై మహాకూటమి జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బాలకృష్ణ.

తెలంగాణ అసెంబ్లీ రద్దయిన తర్వాత, తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బాలకృష్ణ. సత్తుపల్లి నుంచి, మహాకూటమి తరపున సండ్ర వెంకట వీరయ్య అభ్యర్థిత్వం దాదాపు ఖాయమని తేలడంతో, ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. త్వరలో బాలయ్యతో మరిన్ని జిల్లాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీపీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలతో పాటు ఖమ్మం, నల్గొండ సహా సెటిలర్లు ఎక్కువగా ఉండే గ్రేటర్‌ హైదరాబాద్‌లో బాలయ్యతో క్యాంపెన్‌ నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. అయితే, తెలుగుదేశం మహాకూటమిలో భాగం. అందులో సీపీఐ, టీజేఎస్‌తో పాటు కాంగ్రెస్‌ ప్రధాన పక్షంగా ఉంది. కానీ మహాకూటమి తరపున కాకుండా, కేవలం టీడీపీ అభ్యర్థులకే బాలయ్య ప్రచారం చేసే అవకాశముంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్-టీడీపీ కూటమితో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని ప్రచారం చేస్తున్నాయి. అందుకే కేవలం తెలుగు తమ్ముళ్లకు మద్దుతుగానే క్యాంపెన్‌ చేయడం ఉత్తమం అని బాలయ్య కూడా భావిస్తున్నారు. మొత్తానికి బాలయ్య ప్రచారంతో మరిన్ని ర్యాలీలు, సభలకు ప్లాన్‌ చేస్తున్న టీటీడీపీ, పార్టీలో పునరుత్తేజంతో పాటు అభిమానుల కేరింతలు తమ పార్టీ అభ్యర్థులకు ఊపునిస్తాయని భావిస్తోంది.

Similar News