కాపులకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వేషన్ లు కపించడంపై వైసీపీ అధికార ప్రదతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.. చంద్రబాబుకు కాపులపై చిత్తశుద్ధి ఉంటే మంజునాథ కమిషన్ ను బయటపెట్టాలని అందులో ఏముందో చూడకుండా చంద్రబాబు అశాస్త్రీయంగా రిజర్వేషన్ లపై నిర్ణయం తీసుకోవడము వెనుక రాజకీయ కోణం దాగి ఉందని, పోలవరం ప్రాజెక్ట్‌పై వివాదం రాజుకున్న వేళ.. ఆ విషయంపై ప్రజల దృష్టిని మరల్చడానికి కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొచ్చారని తెలిపారు.
తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇన్నాళ్లు కాలయాపన చేశారని విమర్శించారు. ముద్రగడ పద్మనాభం పోరాటం చేయడంతో ఇక తప్పని సరి పరిస్థితుల్లో మంజునాథ కమిషన్ వేశారని, అసలు ఆ కమిషన్ నివేదిక రాకుండానే అసెంబ్లీలో బిల్లు ఎలా పాస్ చేస్తారని అయన ప్రశ్నించారు.. అంతేకాదు రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులదృష్ట్యా చంద్రబాబు కాపు హడావుడి చేస్తున్నారు.. చంద్రబాబుకు నిజంగా కాపులపై ప్రేమ ఉంటే ఇంతకుముందు దీనిపై ఎందుకునిర్ణయం తీసుకోలేదని అంబటి మండిపడ్డారు